Black Hair: జుట్టు నల్లబడాలంటే.. నెయ్యితో ఇలా చేయాల్సిందే?
ఈ రోజుల్లో చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ తెల్లజుట్టు కారణంగా నలుగురిక లోకి వెళ్ళాలి అన్నా క
- By Nakshatra Published Date - 10:00 PM, Sun - 30 July 23
ఈ రోజుల్లో చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ తెల్లజుట్టు కారణంగా నలుగురిక లోకి వెళ్ళాలి అన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడడం కోసం అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు హెయిర్ కలర్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. తెల్ల జుట్టుని నల్లగా చేయడంలో నెయ్యి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. అదలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే జుట్టు పండిపోకుండా ఉంటుంది.
పైగా నల్లగా కూడా ఉంటుంది. వీటితో పాటుగా అది మెటబాలిజంని కరెక్ట్ గా ఉంచుతుంది. అదే విధంగా ఒంట్లో ఉండే చెడు పదార్థాలను కూడా ఇది తొలగిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఉసిరిని తీసుకోండి. ఉసిరి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా ఉసిరిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదే విధంగా మీ తలని అంతటిని కూడా కొబ్బరి నూనెతో మసాజ్ చేయటం మంచిది. ఆ తర్వాత ఉసిరి జ్యూస్‌ని తలకు అప్లై చేసుకోవాలి. అలాగే ప్రతి రోజు మీరు ఆమ్లా జ్యూస్‌ని కూడా తాగవచ్చు. ఉసిరి పొడిని కూడా తలకి అప్లై చేస్తూ ఉండవచ్చు. ఆయుర్వేద షాపుల్లో ఉసిరి పొడి మనకు దొరుకుతుంది. దీన్ని కూడా మీరు హెయిర్ మాస్క్‌గా వేసుకోవచ్చు. మనం వంటల్లో కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటాము. కరివేపాకు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒకటి లేదా రెండు కప్పులు కొబ్బరి నూనె తీసుకొని అందులో గుప్పెడు కరివేపాకులను వేయండి. దీన్ని బాగా మరిగించి నూనె మొత్తం నల్లగా మారె వరకూ ఉంచండి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఒక గాజు సీసా లో వేయండి. ఈ నూనెను తలకు బాగా పట్టించి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే షాంపూతో తల స్నానం చేయాలి. షాంపూ ని ఉపయోగించేటప్పుడు మైల్డ్ షాంపూ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. బృంగరాజ్ జుట్టుకి రాజు. బృంగరాజ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు తెల్లబడకుండా ఇది చేస్తుంది. అదే విధంగా మెటబాలిజంను ఇది కరెక్ట్ చేస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. బృంగరాజ్ ని మీరు తలకు అప్లై చేసుకుని ఒక అర గంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత తలని శుభ్రంగా కడిగేసుకోండి లేదు అంటే షాంపూ స్నానం చేసే ముందు మీరు కొంచెం నూనె తో మసాజ్ చేసుకోండి ఈ విధంగా వారానికి రెండు సార్లు అనుసరిస్తే చక్కటి ఫలితం మీరు పొందొచ్చు. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఈ టిప్ ని కూడా ఫాలో అవ్వండి.
Related News
Jasmine: సువాసనలు వెదజల్లే మల్లెపువ్వుతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండిలా?
మల్లెపువ్వు సువాసన గురించి మనందరికీ తెలిసిందే. దీని సువాసన ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోవడానిక