HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Amazing Benefits Of Aloe Vera For Healthy Skin How To Use It

ఆరోగ్యమైన చర్మానికి కలబందతో అద్బుతమైన ప్రయోజానాలు..ఎలా వాడాలంటే..?

సహజ ఆహారాల్లో కలబంద రసం ఒక ముఖ్యమైనది. చర్మాన్ని లోపలినుంచి పోషిస్తూ సహజమైన కాంతిని అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

  • Author : Latha Suma Date : 07-01-2026 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aloe Vera
Aloe Vera

. చర్మానికి తేమ, రక్షణ అందించే కలబంద రసం

. ముడతలు, వృద్ధాప్య లక్షణాలకు చెక్

. మొటిమలు, దద్దుర్లకు సహజ పరిష్కారం

Aloe Vera For Skin : శరీర ఆరోగ్యాన్ని ఎంత ప్రాముఖ్యంగా చూస్తామో, అంతే ప్రాధాన్యం చర్మ ఆరోగ్యానికీ ఇవ్వాలి. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం చాలా మంది ఖరీదైన బ్యూటీ క్రీములు, స్కిన్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ చర్మం పొడిబారడం, మొటిమలు, దద్దుర్లు, ముందే ముడతలు రావడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. కేవలం బాహ్య సంరక్షణ మాత్రమే కాకుండా, మనం తీసుకునే ఆహారం కూడా చర్మ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అటువంటి సహజ ఆహారాల్లో కలబంద రసం ఒక ముఖ్యమైనది. చర్మాన్ని లోపలినుంచి పోషిస్తూ సహజమైన కాంతిని అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

కలబందలో దాదాపు 98 శాతం వరకు నీరు ఉంటుంది. అందుకే దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి, ముఖ్యంగా చర్మానికి సరిపడా తేమ అందుతుంది. రోజూ ఒక గ్లాస్ కలబంద రసం తాగడం వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. చక్కెర కలిగిన పానీయాల స్థానంలో కలబంద రసాన్ని తీసుకుంటే చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రదనం వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం ఎప్పుడూ తాజాగా, ఉల్లాసంగా కనిపిస్తుంది. వేసవికాలంలో డీహైడ్రేషన్ వల్ల వచ్చే చర్మ సమస్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

వయస్సు పెరిగేకొద్దీ చర్మంపై గీతలు, ముడతలు రావడం సహజం. అయితే కలబంద రసాన్ని నిత్యం తీసుకోవడం ద్వారా ఈ లక్షణాలను కొంతవరకు నియంత్రించవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మానికి లవచత్వాన్ని అందిస్తాయి. ఫలితంగా చర్మం యవ్వనంగా, మెరిసేలా కనిపిస్తుంది. రోజువారీ ఆహారంలో కలబంద రసాన్ని భాగం చేసుకుంటే సహజమైన గ్లోను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కలబందలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మొటిమలు, దద్దుర్లు, చర్మంపై వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. లోపలినుంచి కలబంద రసం తీసుకోవడమే కాకుండా, బయటకు కలబంద జెల్‌ను ఫేస్ మాస్క్‌లా ఉపయోగిస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం చల్లబడటంతో పాటు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అయితే కలబంద రసం తయారు చేసే సమయంలో తాజా, స్వచ్ఛమైన కలబందను మాత్రమే ఉపయోగించాలి. రసాయనాలు కలిపిన ఉత్పత్తులకంటే సహజంగా తయారుచేసిన రసమే చర్మానికి మేలు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి, కలబంద రసం వంటి సహజ పదార్థాల వినియోగం ద్వారా ఖరీదైన చికిత్సలు లేకుండానే మెరిసే, ఆరోగ్యమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aging symptoms
  • Aloe Vera
  • Life Style
  • Moisturizes and protects the skin
  • Preventing skin problems
  • Solution for acne and rashes
  • Without dryness
  • Wrinkles

Related News

Is your hair falling out?.. Follow these tips

చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుందా?.. ఈ టిప్స్‌ పాటిస్తే సమస్యలకు చెక్..!

మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే మంచి విషయం ఏమిటంటే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

    Latest News

    • తెలంగాణ రైతులకు శుభవార్త..

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    • పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !

    • యూజీసీపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు!

    • ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!

    Trending News

      • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

      • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

      • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

      • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

      • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd