HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >A Person Who Has Ingested Poison Is In Danger Of Death Basic Measures To Be Taken Immediately

First Aid for Suicide Attempts : విషం తీసుకున్న వ్యక్తికి ప్రాణాపాయం..వెంటనే తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు!

కొన్ని తక్కువ మోతాదులోనే ప్రమాదకరంగా మారిపోతే, మరికొన్నింటి విషపూరితత ఎక్కువగా ఉండాలి మరణించడానికి. ఉదాహరణకి, నిద్ర మాత్రలు, పలు రకాల టాబ్లెట్లు లేదా క్యాప్సుల్స్ తీసుకుంటే అవి తక్షణమే కడుపులోకి వెళ్లి పని చేయడం ప్రారంభిస్తాయి.

  • By Latha Suma Published Date - 05:55 PM, Wed - 9 July 25
  • daily-hunt
A person who has ingested poison is in danger of death..Basic measures to be taken immediately!
A person who has ingested poison is in danger of death..Basic measures to be taken immediately!

First Aid for Suicide Attempts : ఎవరైనా విషం తీసుకుంటే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రతి విషపు ప్రభావం ఒకేలా ఉండదు. విషం తీసుకున్న వ్యక్తి మరణిస్తాడా లేదా అన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వారు తీసుకున్న విషపు రకం, మోతాదు, తీసుకున్న సమయం ఇవన్నీ కలసి ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. విష పదార్థాలు పలు రకాలుగా ఉంటాయి. కొన్ని తక్కువ మోతాదులోనే ప్రమాదకరంగా మారిపోతే, మరికొన్నింటి విషపూరితత ఎక్కువగా ఉండాలి మరణించడానికి. ఉదాహరణకి, నిద్ర మాత్రలు, పలు రకాల టాబ్లెట్లు లేదా క్యాప్సుల్స్ తీసుకుంటే అవి తక్షణమే కడుపులోకి వెళ్లి పని చేయడం ప్రారంభిస్తాయి. కొన్ని గంటల్లోనే ప్రభావం చూపించి మూర్ఛ లేదా శరీర అవయవాలు సరిగా పనిచేయకపోతే ప్రాణాపాయం ఏర్పడుతుంది.

Read Also: Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు గుడ్‌బై.. పుకార్ల పై స్పందించిన అమితాబ్ బచ్చన్‌

ఇక, ఎలుకల మందు, ఫినాయిల్, ఇతర క్రిమిసంహారక ద్రావకాలు అయితే చాలా వేగంగా ప్రభావం చూపిస్తాయి. ఇవి కేవలం కడుపులో మాత్రమే కాకుండా రక్తంలో కలిసిపోయి శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై దాడి చేస్తాయి. కొన్ని గంటల్లోనే గుండె పనితీరు బలహీనపడటం, ఊపిరితిత్తులపై ప్రభావం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది అత్యంత ప్రమాదకర స్థితి. అలాంటి సమయంలో బాధితుడిని తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లడం ఉత్తమం. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయం తగ్గుతుంది. ముఖ్యంగా విషం తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఈ చర్యలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

విష ప్రభావం తొందరగా బయటకు పోవడానికి వాంతి చేయించడం అవసరం. బాధితుడు తానే వాంతి చేసుకుంటే బాగానే ఉంది. కానీ వాంతి చేయకుండా ఉంటే తప్పనిసరిగా వాంతి చేయించాలి. దీనికోసం ఇంటిలో ఉండే కొన్ని సహజ వస్తువులను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఆవాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఆవాల గింజలను నీటిలో బాగా నూరి పేస్ట్ తయారు చేసి బాధితుడికి చెంచాతో తినిపిస్తే కొంత సేపటికి వాంతి రావచ్చు. ఆవాలు అందుబాటులో లేకపోతే ఉప్పు ఉపయోగించవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక గుప్పెడు ఉప్పు వేసి కలిపి బాధితుడికి తాగించాలి. ఇది కడుపు లోపల ఉన్న విషాన్ని బయటకు తీసివేయడంలో సహాయపడుతుంది. కొన్నిసార్లు ఈ ప్రక్రియ వలన రోగికి తల తిరగడం లేదా అసౌకర్యం కలగవచ్చు. అలాంటి వేళ అతనిని మంచంపై నిద్ర పోయ్యేలా చేసి మెడ వెనుక భాగాన్ని తట్టడం ద్వారా వాంతిని ప్రేరేపించవచ్చు.

ఉప్పు లేదా ఆవాలు ఇంట్లో లేవనుకోండి. ఇలాంటప్పుడు సమయం వృథా కాకుండా బాధితుడిని ఆసుపత్రికి వెంటనే తరలించాలి. కానీ పరిస్థితి అత్యంత అత్యవసరంగా ఉంటే అంటే ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రాణాపాయం కనిపిస్తే తక్షణమే బాధితుడి గొంతులో వేలు పెట్టి వాంతి చేయించేందుకు ప్రయత్నించాలి. ఇది చివరి దశ చర్యగా పరిగణించాలి. ఇది అత్యంత జాగ్రత్త అవసరమైన పని. ఎందుకంటే తప్పుడు విధంగా వాంతి చేయించడంవల్ల విషం మళ్లీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. విషం తీసుకున్న సమాచారం స్పష్టంగా ఉంటే, డాక్టర్లకు తెలియజేయడం ద్వారా వారు సమర్థవంతంగా చికిత్స చేపట్టగలుగుతారు. కాగా, విషం తీసుకున్నప్పుడు ప్రతిక్షణం విలువైనది. త్వరిత చర్యలు, సకాలంలో వాంతి చేయించడం, మరియు హాస్పిటల్‌కు వేగంగా చేరడం ఇవే ప్రాణాలను రక్షించే మార్గాలు. అటువంటి విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రతీ ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలి.

Read Also: Nallamala Forest : నల్లమల అడవుల్లో పులులకు రక్షణ చర్యల్లో డ్రోన్ల వినియోగం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • First aid
  • medical help
  • sleeping pills
  • Suicide Attempts
  • Toxic substances

Related News

    Latest News

    • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

    • IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

    • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

    • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd