HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >5 Best Credit Cards For Women With Awesome Benefits

Credit Cards: అదిరిపోయే బెనిఫిట్స్‌తో మహిళల కోసం 5 బెస్ట్‌ క్రెడిట్‌ కార్డ్స్‌

అందరి అవసరాలూ ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బ్యాంకులు ఆయా వర్గా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక క్రెడిట్‌ కార్డ్‌లను లాంచ్‌ చేస్తున్నాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 05-03-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
5 Best Credit Cards For Women With Awesome Benefits
5 Best Credit Cards For Women With Awesome Benefits

అందరి అవసరాలూ ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బ్యాంకులు ఆయా వర్గా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక క్రెడిట్‌ కార్డ్‌లను (Credit Cards) లాంచ్‌ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరిలాగే, మహిళలు తమ రోజువారీ ఖర్చుల కోసం, అప్పుడప్పుడు పెద్ద కొనుగోళ్లకు, రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌ లేదా ఇతర ప్రయోజనాల కోసం క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తారు. మహిళలు తరచూ వస్త్రాలు, కిరాణా, డైనింగ్, మూవీస్‌, ట్రావెల్‌ టిక్కెట్ల కోసం క్రెడిట్‌ కార్డ్‌లను ఎక్కువ ఉపయోగిస్తారు. ఉమెన్స్‌ డే 2023 సందర్భంగా మహిళలకు సరిపోయే బెస్ట్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ (Credit Cards) లిస్ట్‌ను పైసాబజార్‌ అందించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్:

SBI Cashback Credit Card Ad - YouTube

ఈ కార్డ్ సంవత్సరంలో నాలుగు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లను అందిస్తుంది. వినియోగదారులు భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్లలో 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును పొందుతారు. అదే విధంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఆఫ్‌లైన్ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఈ కార్డ్‌పై వార్షిక రుసుము రూ. 999. ఒక సంవత్సరంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్:

Axis Bank My Zone Credit Card Benefits, Charges & Apply - Bank Fiber

ఈ కార్డ్‌ పేటీఎం మూవీస్‌లో రెండో సినిమా టిక్కెట్‌ బుకింగ్‌పై 100 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. సోనీలివ్ ప్రీమియం యాన్యువల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను, AJIOలో కనీసం రూ.2,000 ఖర్చులపై ఫ్లాట్ రూ.600 డిస్కౌంట్‌ పొందవచ్చు. కార్డ్ ద్వారా ఖర్చు చేసే ప్రతి రూ.200పై 4 EDGE రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. త్రైమాసికంలో భారతదేశంలోని ఒక విమానాశ్రయ లాంజ్‌ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ.500.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్:

Flipkart Axis Bank Credit Card Review - How to apply, charges

ఈ కార్డ్‌ ద్వార కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ , మింత్రలో 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఉబర్‌, స్విగ్గీ, పీవీఆర్‌, క్యూర్‌ఫిట్‌, టాటా ప్లే, క్లియర్‌ట్రిప్‌ ట్రాన్సాక్షన్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కార్డ్ హోల్డర్‌కు సంవత్సరంలో నాలుగు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ.500. అదే విధంగా రూ.1,100 విలువైన వెల్‌కమ్‌ బెనిఫిట్స్‌ అందిస్తుంది.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ స్మార్ట్‌ఎర్న్‌ క్రెడిట్‌ కార్డ్‌:

American Express SmartEarn Credit Card Review – CardExpert

ఈ కార్డ్‌ను అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అందిస్తోంది. కార్డ్ మెంబర్‌షిప్‌లో మొదటి 90 రోజులలో రూ.10,000 ఖర్చు చేసినందుకు వినియోగదారులు వెల్‌కమ్‌ బోనస్‌గా రూ.500 క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. వార్షిక రుసుముగా రూ.495 చెల్లించాలి.దీని ద్వారా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, ఉబర్‌లో వెచ్చించే ప్రతి రూ.50కి 10X మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. పేటీఎం వాలెట్, స్విగ్గీ, బుక్‌మైషో, పీవీఆర్‌, మైంత్ర, జబాంగ్‌, గ్రోఫెర్స్‌, బిగ్‌ బజార్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.50కి 5X మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్‌లు ఉంటాయి. ఇతర కేటగిరీలపై ఖర్చు చేసే ప్రతి రూ.50కి ఒక మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్‌ను పొందవచ్చు.

స్టాండర్డ్ చార్టర్డ్ ఈజ్‌మైట్రిప్‌ క్రెడిట్ కార్డ్:

Low annual fees and good value: 5 cards that top the list

ఈ కార్డ్‌ను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆఫర్‌ చేస్తోంది. ఈ కార్డ్‌కు వార్షిక రుసుము రూ.350 చెల్లించాలి. కార్డ్‌తో ఈజ్‌మైట్రిప్‌ వెబ్‌సైట్, యాప్‌లో హోటల్, ఫ్లైట్ బుకింగ్‌లపై వరుసగా ఫ్లాట్ 20, 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. బస్ టిక్కెట్ బుకింగ్‌లపై రూ.125 డిస్కౌంట్‌ పొందవచ్చు. స్టాండ్‌లోన్ హోటల్, ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లు, యాప్‌లు లేదా అవుట్‌లెట్‌లలో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఖర్చు చేసే ప్రతి రూ.100పై 10X రివార్డ్‌లను కూడా అందిస్తుంది. త్రైమాసికానికి ఒక కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, సంవత్సరానికి రెండు అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది.

Also Read:  Second Day of Vizag GIS: విశాఖ సదస్సు రెండో రోజు 8 రంగాలపై సెషన్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Best
  • Credit Cards
  • Life Style
  • offers
  • women

Related News

Investment Women

Investment : ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ‘మహిళా’ విప్లవం!

యాక్సిస్ డైరెక్ట్ తాజా నివేదిక ప్రకారం, 2021 నుండి మహిళల పేరిట ఉన్న డీమాట్ ఖాతాల సంఖ్య ఏకంగా 129% వృద్ధి చెందింది. ఈ మార్పులో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మహిళలు చేస్తున్న

  • Gut Health

    Gut Health: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.. తినాల్సిన ఫుడ్స్

  • Fatty Liver Stages

    Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

Latest News

  • Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

  • TFJA Dairy Discovery : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ ఆవిష్కరణ

  • AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • IPL 2026 : సన్‌రైజర్స్‌తో చేతులు కలిపిన జిందాల్

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd