Weight Loss : ఏ డైట్ ఫాలో అయినా బరువు తగ్గట్లేదా..?
Weight Loss : 5:2 డైట్ అనే కొత్త విధానం బరువు తగ్గడానికి సులభతరం, సంతోషంగా అనిపించేలా ఉంటుంది. ఈ డైట్‌లో వారానికి ఐదు రోజులు సాధారణంగా తినొచ్చు.
- By Sudheer Published Date - 06:45 AM, Sat - 29 March 25

బరువు తగ్గేందుకు చాలా మంది కఠినమైన డైట్ ప్లాన్స్‌ను ఫాలో అవుతూ కొంత కాలానికే విరమించుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఆహారంపై తీవ్రమైన పరిమితులు ఉండటమే. అయితే 5:2 డైట్ అనే కొత్త విధానం బరువు తగ్గడానికి సులభతరం, సంతోషంగా అనిపించేలా ఉంటుంది. ఈ డైట్‌లో వారానికి ఐదు రోజులు సాధారణంగా తినొచ్చు. అయితే మిగిలిన రెండు రోజులు కేవలం 500-600 కేలరీలు మాత్రమే తీసుకోవాలి. ఈ రెండు ఉపవాస రోజుల మధ్య కనీసం ఒక రోజు గ్యాప్ ఉండాలి. ఈ విధానం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీర జీవక్రియ మెరుగుపడుతుంది.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
5:2 డైట్‌లో ఉపవాసం ఉన్న రోజుల్లో పోషకాహారంతో నిండిన తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలి. ఇందులో కూరగాయలు, ఆకుకూరలు, న్యూట్రిషన్ ఎక్కువగా ఉన్న పండ్లు, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఫుడ్స్ ఉండాలి. జంక్ ఫుడ్ తింటే ఎప్పటికీ బరువు తగ్గలేరు. కనుక ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే నీరు, హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ లాంటి తక్కువ కేలరీల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కోలెస్ట్రాల్ తగ్గి, శరీరంలోని ఫ్యాట్ నెమ్మదిగా కరిగిపోతుంది.
5:2 డైట్ ప్రయోజనాలు
ఈ డైట్ విధానం శరీరానికి అనేక లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా ఇన్సులిన్ స్థాయిలను తగ్గించి, మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది. అంతేకాకుండా హార్ట్ సమస్యలు, మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు, అలర్జీలు తగ్గుతాయి. అయితే ప్రెగ్నెంట్ మహిళలు, పిల్లలు, డయాబెటిస్ ఉన్న వారు ఈ డైట్ చేయకూడదు. ఎవరైనా కొత్త డైట్ ట్రై చేయాలంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. 5:2 డైట్ సరైన పద్ధతిలో పాటిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
CM Revanth Reddy: అత్యంత శక్తిమంతుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!