UP : పోర్న్ వీడియోలకు బానిసైన యువకుడు.. చెల్లిపై అత్యాచారం
- By Sudheer Published Date - 01:08 PM, Tue - 6 February 24

ఇటీవల కాలంలో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా వావివరుసలు మరచి కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. పోర్న్ వీడియోలకు బానిసైన యువకుడు..సొంత చెల్లిపై అత్యాచారం చేసిన ఘటన యూపీలోని కాస్‌గంజ్ నగరంలో చోటుచేసుకుంది.
ఈ నెల 3వ తేదీన తల్లి ఇంట్లో లేని సమయంలో నిందితుడు సంజూ కుమార్ మొబైల్ ఫోనులో పోర్న్ వీడియోలను చూశాడు. దీంతో చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం బయటకు చెబుతుందన భయంతో ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. బాలిక బంధువు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన స్టయిల్ లో విచారించగా నేరం ఒప్పుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన పిల్లలనే వ్యభిచార రొంపిలోకిదించింది ఓ కసాయి తల్లి. అదికూడా తండ్రి వయసున్న వ్యక్తి తో..ఇప్పటికే ఇద్దరు భర్తలను మార్చి మూడో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె.. మొదటి ఇద్దరు భర్తలకు పుట్టిన పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. వ్యభిచారం చేసి తనను, తన ప్రియుడిని పోషించాలంటూ బలవంతంగా ఆ పిల్లలను వ్యభిచారంలోకి దించింది. ప్రియుడి కోరిక కూడా తీర్చాలంటూ వేధించ సాగింది. తాము చెప్పినట్టు మాట వినడం లేదని బాలిక ప్రైవేట్ అవయవాలపై కాల్చి వాతలు పెట్టారు. తల్లి, ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేని ఆ బాలిక.. ఇంట్లో నుండి పారిపోయి..అక్క దగ్గ్గరికి వచ్చింది. ఇరువురు సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనను ఆశ్రయించారు. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Also : YCP : వైసీపీ నేతలు.. పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారా..?