CM Yogi Adityanath: సైబర్ నేరగాళ్లకు చమటలే ఇక.. 57 కొత్త సైబర్ పోలీస్ స్టేషన్లు
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సైబర్ నేరగాళ్ళను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది. జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్‌క్రైమ్‌లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- Author : Praveen Aluthuru
Date : 30-04-2024 - 9:58 IST
Published By : Hashtagu Telugu Desk
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సైబర్ నేరగాళ్ళను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది. జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్‌క్రైమ్‌లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 18 డివిజన్లలో సైబర్ స్టేషన్లు పనిచేస్తుండగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన 57 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నారు.
కొత్తగా ఏర్పాటయ్యే 57 సైబర్ పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ స్టేషన్ల ఖరారు జరగనుంది. ఒక్కో సైబర్ స్టేషన్‌లో 25 మంది అధికారులతో మొత్తం 57 సైబర్ స్టేషన్‌లకు గానూ 1,425 మంది అధికారులు నియమితులవుతారు. సైబర్ స్టేషన్లను గతంలో ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఈ స్టేషన్‌ల బాధ్యతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వీకరిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు 25 పోస్టులను కేటాయిస్తూ 1,425 మంది సిబ్బందికి ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు మరియు ఆ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించిన కారణంగా ఈ చొరవ ఆలస్యమైంది. సైబర్ స్టేషన్లు ఈ సైబర్ పోలీస్ స్టేషన్లు పూర్తి అయితే రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని సైబర్ నేరగాళ్ల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగానే అక్కడ అధికారుల సంఖ్యని పెంచుతున్నారు.
Also Read: Pani Puri : వామ్మో..ప్లేటు పానీపూరీ రూ.333