Sanatana Dharma : సనాతన ధర్మం ఒక్కటే మతం.. మిగతావన్నీ పూజా విధానాలే : సీఎం యోగి
Sanatana Dharma : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Author : Pasha
Date : 03-10-2023 - 3:02 IST
Published By : Hashtagu Telugu Desk
Sanatana Dharma : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని, మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మహంత్ దిగ్విజయ్ నాథ్ 54వ వర్థంతి, సాధువు మహంత్ వైద్యనాథ్ 9వ వర్థంతి సందర్భంగా గోరఖ్ నాథ్ ఆలయం లో 7 రోజుల పాటు శ్రీమద్ భాగవత్ కథా జ్ఞాన యాగం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join
దీనికి సంబంధించిన ముగింపు కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మం మానవత్వానికి ప్రతీక. దానిపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం ఎదురవుతుంది’ అని పేర్కొన్నారు. శ్రీమద్భాగవతం సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి విశాలమైన మైండ్ సెట్ కలిగి ఉండాలన్నారు. సంకుచిత మనస్తత్వం ఉంటే దానిని అర్థం చేసుకోలేరని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. భాగవత కథను నిర్దిష్టంగా కొన్ని రోజులు కొన్ని గంటలకు పరిమితం చేయలేమని, ఇది అనంతమైనదని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై(Sanatana Dharma) ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో కేసు నమోదైంది.
Also read : Fruits: రాత్రిపూట ఈ పండ్లు పొరపాటున కూడా తినకండి..!