HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Work Or Be Axed Kejriwal Tells Punjab Aap Ministers

Kejriwal: ఆప్ నేతలకు ‘కేజ్రీవాల్’ దిశానిర్దేశం!

ఇంతింతై అన్నట్టుగా ఆప్ పార్టీ దేశవ్యాప్తంగా నలుములాల విస్తరిస్తోంది. ఢిల్లీకి పరిమితమైన ఆప్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకొని...

  • Author : Balu J Date : 21-03-2022 - 4:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kejriwal
Kejriwal

ఇంతింతై అన్నట్టుగా ఆప్ పార్టీ దేశవ్యాప్తంగా నలుములాల విస్తరిస్తోంది. ఢిల్లీకి పరిమితమైన ఆప్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకొని, ఇతర రాష్ట్రాలపై ద్రుష్టి సారిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పాదయాత్ర చేయనున్నట్టు, సగం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక పంజాబ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు. భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రుల పనితీరు గురించి చర్చించారు. పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలకు పాల్పడినా, అవినీతి కార్యకలాపాలు కొనసాగించినా వెంటనే చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.

“నేను అన్నింటినీ సహిస్తాను. కానీ అవినీతిని, ప్రజాధనాన్ని దోచుకోవడం సహించను. ఎవరైనా ఎమ్మెల్యే లేదా మంత్రి తమ తమ లక్ష్యాలను చేరుకోకపోతే మరో అవకాశం ఇస్తాం. కానీ అవినీతికి పాల్పడితే రెండో అవకాశం ఉండదు’’ అని కేజ్రీ హెచ్చరించారు. క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్‌లోని పార్టీ 92 మంది శాసనసభ్యులతో వీడియో కాల్ ద్వారా సంభాషించారు. మాన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు టీమ్‌గా పని చేయాల్సి ఉందన్నారు. శాసనసభ్యులు చండీగఢ్‌లో ఉండకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆప్ కార్యకర్తలు, సంఘ సభ్యులతో వారి నియోజకవర్గాల గ్రామాల్లో సందర్శించాలని ఆయన సూచించారు. ఢిల్లీలో మాదిరిగానే పంజాబ్‌లో కూడా ఎమ్మెల్యేల పనితీరును బట్టి అంచనా వేస్తామని సీఎం మాన్ కూడా పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో, AAP 22 మంది ఎమ్మెల్యేలను మళ్లీ పదవికి పోటీ చేయడానికి అనుమతించలేదు ఎందుకంటే వారి పనితీరు ప్రజలకు నచ్చలేదు. కాబట్టి ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గంలో శాశ్వత కార్యాలయాన్ని తెరిచి అక్కడ ఉండాలి. ప్రజల సమస్యలను విని వాటిని సకాలంలో పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. మీరు ప్రజలను కలవడానికి ఏ సమయంలో ఇచ్చినా, ఏ సందర్భంలోనైనా, ఆ సమయంలో అక్కడ ఉండండి”మన్ చెప్పాడు.

పోలీసులు, ఇతర అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సూచించారు. ఎవరైనా ఇలా చేస్తే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ అధికారి అయినా పని చేయకపోతే లేదా ఎమ్మెల్యేల మాట వినకుంటే, శాసనసభ్యుడు దానిని ముఖ్యమంత్రికి నివేదించాలి. లోటుపాట్లను చర్చించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులతో లేదా ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించవద్దని, “అందరితో ప్రేమతో మెలగండి” అని ఆయన శాసనసభ్యులకు సూచించారు. ఢిల్లీలో విద్యా విప్లవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులదేనన్నారు. నిర్భయ, అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేయాలని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP in Punjab
  • arvind kejriwal
  • assembly election
  • delhi

Related News

Death

Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో 25 ఏళ్ల దీపిక నాగర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అత్త ఇంటిలోని పైకప్పు నుంచి పడిపోయి మృతి చెందినట్టు పోలీసులు చెబుతుండగా… ఇది ఆత్మహత్య కాదు, కట్నం కోసం చేసిన హత్య అని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. “ఫార్చ్యూనర్ కారు, ₹51 లక్షలు కావాలని వేధించారు. పెళ్లిలోనే ₹11 లక్షల నగదు, ₹50 లక్షల బంగారం, ఫర్నిచర్, స్కార్పియో కారు ఇచ్చాం” అంటూ త‌న తం

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd