Women’s Reservation Bill: ప్రజా జీవితంలోకి వచ్చేందుకు మహిళలకు మంచి అవకాశం
కొత్త పార్లమెంట్ హౌస్‌లో ప్రత్యేక సమావేశాల రెండో రోజు మహిళలకు సంబంధించిన చారిత్రక అడుగు పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
- By Praveen Aluthuru Published Date - 08:48 PM, Tue - 19 September 23

Women’s Reservation Bill: కొత్త పార్లమెంట్ హౌస్‌లో ప్రత్యేక సమావేశాల రెండో రోజు మహిళలకు సంబంధించిన చారిత్రక అడుగు పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సభలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారు. ఈ బిల్లుకు కొన్ని పార్టీల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ మహిళలు ప్రజాజీవితంలోలో ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.
ఈ బిల్లు వల్ల కలిగే ప్రయోజనాలను సౌందరరాజన్ వివరిస్తూ దేశంలోని మొత్తం ఓటర్లలో 50 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం అధికారాన్ని కల్పించడం వల్ల వారు ప్రజాజీవితంలో పాలుపంచుకోగలుగుతారు. బిల్లు అమలైతే పుదుచ్చేరిలోని ప్రాంతీయ అసెంబ్లీలో 11 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారని అన్నారు. అదే సమయంలో తమిళనాడులో 77 మంది మహిళా ఎమ్మెల్యేలు, 13 మంది మహిళా ఎంపీలు ఉంటారని చెప్పారు.మహిళల సామర్థ్యాలను గుర్తించి, చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించేలా చర్యలు తీసుకున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: KTR : కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్‌కే వేయండి..