బీజేపీ మార్క్ పాలిటిక్స్
మి గిలిన పార్టీలకు భిన్నంగా బీజేపీ ఉంటుంది. ఆ పార్టీని వీడి వెళ్లిన నేతలు ఎవరు విజయవంతం కాలేదు. మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తేనే రాజకీయాల్లో రాణించారు
- By Hashtag U Published Date - 08:33 AM, Fri - 29 October 21

మిగిలిన పార్టీలకు భిన్నంగా బీజేపీ ఉంటుంది. ఆ పార్టీని వీడి వెళ్లిన నేతలు ఎవరు విజయవంతం కాలేదు. మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తేనే రాజకీయాల్లో రాణించారు. కాంగ్రెస్ పార్టీని వీడి విజయం సాధించిన విధంగా బీజేపీ నుంచి వెళ్లిన లీడర్ ల చరిత్ర లేదు.
నేతలు పార్టీ మారడం సర్వ సాధారణం .. పార్టీల నుండి జంప్ జిలానీ లు కోకొల్లలు . బడా నేతల నుండి చోట మోట లీడర్ల వరకు పార్టీ మారడం కొత్త కాదు.. కానీ బీజేపీ లో అలా కాదు. పదవీ లేకున్నా,రాకున్నా ఆ పార్టీ వెంటే ఉండకపోతే భవిషత్ ఉండదని అర్థం అవుతుంది. అందుకే ఎవరూ పార్టీని వీడే ఆలోచన సహజం గా చేయరు.
ఇలా బీజేపీ ని వీడి మళ్ళీ సొంత గూటికి చేరిన సీనియర్ నాయకులు చాలా మందే ఉన్నారు ఉదాహరణ కు సీనియర్ లీడర్లు ఉమభారతి,మదన్ లాల్ ఖురానా, కళ్యాణ్ సింగ్.బీజేపీ తరపున మధ్యప్రదేశ్ సీఎం గ చేసిన ఉమభారతి పార్టీ క్రమశిక్షణ కారణంగా 2005 డిసెంబర్ లో అప్పటి పార్టీ ప్రెసిడెంట్ అద్వానీ ఆదేశాల మేరకు పార్టీ నుండి బహిష్కరించారు. దీంతో తను భారతీయ జనశక్తి పార్టీ పెట్టి విఫలం కావడం తో 2011 మళ్ళీ బీజేపీ గూటికి చేరి ప్రధాని మోదీ మంత్రివర్గములో చోటు దక్కించు కున్నారు.. ప్రస్తుతం బీజేపీ లో సీనియర్ లీడర్ గా ఉన్నారు.
హిందుత్వ వాది,రెండు సార్లు(1991-92,1997-99 ) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసిన కళ్యాణసింగ్.. సీనియర్ నాయకుడు వాజపేయ్ తో పొసగక పోవడం తో పార్టీ ప్రధాన కార్యక్రమాలకు దూరం అయ్యారు..వీరిద్దరూ ప్రస్తుతం మెయిన్ స్ట్రీం లో లేక పోయినా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు.
పార్టీ వీడిన వారికి పరాభవాలు తప్పడం లేదు.బీజేపీ తో 13 ఏళ్ల బంధాన్ని తెంచుకొన్న సిద్దు,కాంగ్రెస్ గూటికి చేరాడు.క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవజ్యోత్ సింగ్ సిద్దు,పంజాబ్ సీఎం అమరేంద్రసింగ్ తో విభేదాల కారణంగా,అంత షైన్ కాలేక పోయారు.
జస్వంత్ సింగ్, శత్రుజ్ఞ సిన్హా, కీర్తి అజాద్, మన్వెంద్రసింగ్ ఏశ్వంత్ సిన్హా లాంటి నేతలు పార్టీ ని వీడి ప్రభావం కోల్పోతే,బీజేపీ సీనియర్ నేతలు కళ్యాణ్ సింగ్,బాబూలాల్ మారండి,ఉమభారతి, ఎడియురప్ప లాంటి వారు పార్టీ ని వీడి తమ సొంత పార్టీ పెట్టుకొని తిరిగి బీజేపీ లో కి వొచ్చి సక్సెస్ అయ్యారు..
ఇలా నేతల విజయం వెనుక పార్టీ ఉంది.పార్టీ విజయం వెనుక దాని సిద్ధాంతం ఉంది. నాయకుల సొంత ఎజెండా పార్టీ సిద్ధాంతం ముందు పనిచేయలేదు. బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ కావడం, కార్యకర్తలు ఓటర్లు కలగలిసి ఉండడం పార్టీ కి కలిసొచ్చి న అంశాలు.
Related News

Telangana : సత్తుపల్లిలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కోనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్