Professor Saibaba : ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు.. ఆయనను పదేళ్లు జైలులో ఎందుకు ఉంచారు ?
సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్ (Professor Saibaba). ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో పనిచేసేవారు.
- By Pasha Published Date - 10:02 AM, Sun - 13 October 24

Professor Saibaba : జీ.ఎన్. సాయిబాబా(57).. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్. ఈయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్సపొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇంతకీ జీ.ఎన్. సాయిబాబా ఎవరు ? ఆయనపై ఉన్న అభియోగాలు ఏమిటి ? పదేళ్లు ఎందుకు జైలులో ఉంచారు ?
Also Read :Baba Siddique : దారుణ హత్యకు గురైన బాబా సిద్దీఖ్ ఎవరు ?
- సాయిబాబాకు ఐదేళ్ల వయసులోనే పోలియో సోకడంతో నడవలేని పరిస్థితి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.
- ప్రొఫెసర్ సాయిబాబా పక్షవాతంతో బాధపడేవారు. ఆయనకు 90 శాతం వైకల్యం ఉంది.
- సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్ (Professor Saibaba). ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో పనిచేసేవారు.
- మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ- అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదు చేశారు.
- పోలీసులు అరెస్టు చేయడంతో సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.
- 2017లో ఓ కోర్టు సాయిబాబాను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే దీనిపై ఆయన న్యాయపోరాటం కొనసాగించారు. ఎగువ కోర్టులో అప్పీల్ చేశారు.
- సాయిబాబా పదేళ్లపాటు జైలులో ఉన్నారు.
- బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పుతో ఎట్టకేలకు ఆయన ఈ ఏడాది మార్చి 5న నిర్దోషిగా విడుదలయ్యారు.
- మావోయిస్టు సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుగా ఉండడం యూఏపీఏ చట్టం కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
- పదేళ్ల పాటు జైలులో ఉండటంతో సాయిబాబా ఆరోగ్యం చాలా దెబ్బతింది. నరాలు దెబ్బతిన్నాయి. కాలేయ సమస్యలు వచ్చాయి. బీపీ ప్రాబ్లమ్స్‌ను ఆయన ఎదుర్కొన్నారు. హృద్రోగ సమస్యలు చుట్టుముట్టాయి.
- సెప్టెంబరు 28న సాయిబాబాకు గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. దీంతో పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో ఆయన బాధపడ్డారు. బీపీ కూడా డౌన్ అయింది.
- సాయిబాబాకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు.