షారూఖ్ కొడుకుకు బెయిల్ ఇప్పించిన ముకుల్ రోహత్గీ ఫీజ్ ఎంతో తెలుసా?
ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా 20 రోజులపాటు జైల్లో ఉన్న ఆర్మన్‌ఖాన్‌కు బెయిల్ తెప్పించారు ముకుల్ రోహత్గీ.
- By Hashtag U Published Date - 12:12 PM, Fri - 29 October 21

ముంబై డ్రగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు దాదాపు 20 రోజుల పాటు ఆర్ధర్‌రోడ్ జైల్లో ఉన్నాడు. భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఆర్యన్‌ఖాన్ బెయిల్ కేసులో అతని తరఫున వాదించారు.
అప్పటికే సతీష్ మానేషిండే, అమిత్‌దేశాయ్‌లాంటి పెద్దపెద్ద లాయర్లు ఆర్యన్ బెయిల్ కేసుపై పనిచేశారు. అక్టోబర్ 3న జరిగిన రెయిడ్‌లో ఆర్యన్‌ఖాన్ అరెస్టయిన దగ్గర్నుంచి అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాలేదు. అయితే, ముకుల్ రోహత్గీ వాదించిన తర్వాత కానీ ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ రాలేదు.
ఎవరీ ముకుల్ రోహత్గీ.?
కేకే వేణుగోపాల్ తర్వాత భారత 14వ అటార్నీ జనరల్‌గా ముకుల్ రోహత్గీ పనిచేశారు. అడిషనల్ సోలిసిటర్ జనరల్‌గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా విధులు నిర్వహించారు. ఢిల్లీ మాజీ హైకోర్ట్ జడ్జ్ జస్టిస్ అవధ్ బిహారీ రోహత్గీ కుమారుడు.
66 ఏళ్ల ముకుల్ రోహత్గీ 2014 నుంచి 2017 వరకు అడిషనల్ సోలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసుతో పాటు ఎన్నో హైప్రొఫైల్ కేసులను వాదించారు. ముంబై లా కాలేజ్ చదివిన ఆయన, మాజీ సీజేఐ యోగేష్‌కుమార్ సబర్వాల్ దగ్గర కొంతకాలం ప్రాక్టీస్ చేసి తన సొంత ఫర్మ్ పెట్టుకున్నారు. 1993లో సీనియర్ కౌన్సిల్‌గా ఢిల్లీ హైకోర్టు ఆయనను గుర్తించింది.
కేసుకు ఎంత తీసుకుంటారో తెలుసా?
ఇలాంటి హైప్రొఫైల్ కేసుల్లో లాయర్లు తీసుకునే ఫీజు కనీసం ఎవరూ ఊహించలేరు. రోహత్గీ దగ్గర దాదాపు 80మంది లాయర్లు పనిచేస్తుంటారు. సీఈవోలు, పొలిటీషియన్స్, ఫేమస్ పర్సనాలిటీలకు సంబంధించి 5 నుంచి 20 కేసులను మాత్రమే ఆయన హ్యాండిల్ చేస్తారు. ఒకసారి కోర్ట అప్పియరెన్స్‌కు రోహత్గీ 10 నుంచి 50 లక్షల వరకు తీసుకుంటారట. ఇక కేసు మొత్తానికి 3 నుంచి 6 కోట్లు తీసుకుంటారని సమాచారం.
ఇక ఆతన దగ్గర పనిచేసే జూనియర్స్ ఒకసారి కోర్ట్ అప్పియరెన్స్ ఇస్తే 15 నుంచి 25 వేల వరకు ఛార్జ్ చేస్తారట.కేసుకు అయితే 5 నుంచి 15 లక్షల వరకు తీసుకుంటారు. జఠ్మలానీ సుప్రీంకోర్టులో వాదిస్తే 25 లక్షలు తీసుకుంటారు. ఇలాంటి లాయర్ల దగ్గరకు వచ్చే 80శాతం కేసులు జూనియర్లే నడిపిస్తారు. ఆర్యన్‌ఖాన్ బెయిల్‌లాంటి హైప్రొఫైల్ కేసులకు మాత్రమే రోహత్గీలాంటి వాళ్లు హాజరవుతారు.
Related News

Virat Kohli: ముంబైలో ప్రత్యక్షమైన విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యక్తిగత కారణాల కోసం ముంబై వెళ్ళినట్లు ధృవీకరించింది.