Modi Surname Case: రాహుల్ కు జైలు ఖాయమా?.. ముందున్న అవకాశాలేంటి?
మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్కున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కష్టాలు తీరేలా కనిపించడం లేదు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ
- By Praveen Aluthuru Published Date - 04:05 PM, Thu - 20 April 23

Modi Surname Case: మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్కున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కష్టాలు తీరేలా కనిపించడం లేదు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అప్పీలును సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. సీజేఎం కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను రాహుల్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. అయితే రాహుల్ కోరికను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. అతడికి రెండేళ్ల శిక్షను సమర్థిస్తూ కోర్టు అప్పీలును కొట్టివేసింది. రాహుల్‌గాంధీ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో రాహుల్ జైలుకెళ్లడం ఖాయమంటున్నారు కొందరు.
రాహుల్ గాంధీకి ఇప్పుడు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. అతని బెయిల్ గడువు ఏప్రిల్ 23తో ముగుస్తుంది. నిజానికి మార్చి 23న రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష విధించింది. అయితే రాహుల్ శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి కోర్టు నుంచి ఉపశమనం లభించేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
కిందికోర్టు నుంచి శిక్ష ఖరారు కాగానే రాహుల్ గాంధీ అప్పీలును సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. హైకోర్టు నుంచి కూడా ఉపశమనం లభించని పక్షంలో రాహుల్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీకి మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించారు. శిక్షతో పాటు సెషన్స్ కోర్టును ఆశ్రయించేందుకు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. ఏప్రిల్ 23లోగా రాహుల్‌కు ఉపశమనం కలగకపోతే జైలుకు వెళ్లక తప్పదు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద ప్రకటన చేశారు. దీంతో ఆయనపై పరువునష్టం కేసు నమోదైంది.
Read More : RGV Gift To CBN: చంద్రబాబుకు రాంగోపాల్ వర్మ అదిరిపోయే గిఫ్ట్.. సర్ప్రైజ్ ఇదిగో!