Vijayasai Reddy: వెంకయ్యనాయుడు సీట్లో విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది.
- Author : Balu J
Date : 04-08-2022 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది. రాజ్యసభ ను నిర్వహించే సభాపతి స్థానంలో కూర్చున్నారు. ఆయన రాజ్యసభ ఉప చైర్మన్ ప్యానెల్ లో ఉండడంతో అరుదైన అవకాశం సాయిరెడ్డికి లభించింది. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గైర్హాజరు కావడంతో రాజ్యసభలో సమావేశాలను నిర్వహించే అవకాశం విజయసాయికి దక్కింది. ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో ఆయన గురువారం సభాపతి సీట్లో దర్శనమిచ్చారు. సభా కార్యక్రమాలను కాసేపు నిర్వహించారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడుతూ సభను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ స్టేట్ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను షేర్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.