HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Vande Bharat Sleeper Trial Run Successful

Vande Bharat Sleeper : వందే భారత్‌ స్లీపర్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది.

  • Author : Latha Suma Date : 24-12-2024 - 2:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Sleeper
Vande Bharat Sleeper

Vande Bharat Sleeper : అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వందే భారత్‌ స్లీపర్‌ ట్రెయిన్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ మేరకు ట్రయల్‌రన్‌ను మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్‌ నుంచి కజురహో చేరిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. శనివారం అక్కడి నుంచి మహోబాకు చేరుకున్నది. మరుసటి రోజు కజురహో నుంచి తిరిగి మహోబాకు వచ్చింది. ఈసందర్భంగా కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది.

ఈ సందర్భంగా అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. ఎస్‌ఆర్‌డీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్‌ రన్‌లో రైల్వే టెక్నికల్‌ టీమ్‌తోపాటు, ఐసీఎప్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక.. వందేభారత్‌ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. స్పీడ్‌తో వెళ్లేలా తయారుచేశారు. కాగా ఈ రైలు వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్‌ రైల్వే భావిస్తున్నది. దీనికోసం పది రైళ్లను సిద్ధం చేస్తున్నది. వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఒక కోచ్‌ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్‌ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్‌ సైతం ఉంటుంది.

ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్‌ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. రైలులో ఫైర్‌ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్‌ వద్ద అత్యవసర స్టాప్‌ బటన్స్‌ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్‌ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు.

Read Also: Hot Chocolate Drink : వింటర్ హాట్ చాక్లెట్ డ్రింక్ వంటకాలు ఇంట్లో ఆనందించండి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai ICF
  • Khajuraho
  • Madhya Pradesh
  • Trial Run
  • Vande Bharat Sleeper

Related News

Setback for Meenakshi Natarajan in Supreme Court

Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించిన తర్వాత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితమని స్పష్టం చేసింది. జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ ఏఎస్‌ చంద్రుర్కర్

  • CM Revanth furious over Meenakshi Natarajan incident.

    Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్

Latest News

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

  • Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి

  • TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

  • Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd