HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Utter Pradesh 2022 Assembly Elections

UP Elections: యూపీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి?

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం మన వైపు చూస్తుంది. కానీ.. మన దేశంలోని రాజకీయ పార్టీలకు, నాయకులకు మాత్రం ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలూ.. అందులో గెలుపోటములు అంతే ! చిన్న బై ఎలక్షన్ లకే దేశాన్ని గాలికి వదిలేసి కేంద్ర మంత్రులు ప్రచారానికి క్యూ కడుతుంటారు..

  • Author : hashtagu Date : 16-12-2021 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం మన వైపు చూస్తుంది. కానీ.. మన దేశంలోని రాజకీయ పార్టీలకు, నాయకులకు మాత్రం ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలూ.. అందులో గెలుపోటములు అంతే ! చిన్న బై ఎలక్షన్ లకే దేశాన్ని గాలికి వదిలేసి కేంద్ర మంత్రులు ప్రచారానికి క్యూ కడుతుంటారు.. అలాంటిది ఉత్తర్ ప్రదేశ్ లో 403 అసెంబ్లీ సీట్లకు జరిగే ఈ ఎన్నిలు అంటే మాటలా ? అందులోనూ.. 80 లోక్ సభ సీట్లు ఉండే రాష్ట్రం.

ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్షంగా పావులు కదుపుతున్నాయి. ఓటర్లను ఆకర్షించే పథకాలు, ప్రసంగాలు మొదలయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రారంబోత్ససవాలు, శంకుస్థాపనలు అంటూ ఉత్తర్ ప్రదేశ్ లోనే మకాం వేస్తున్నారు. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ కార్యక్రమం లో అమిత్ షా మాట్లాడుతూ 2024లో మోడీ గెలవాలంటే 2022యూపీ లో యోగి గెలవాలి అని అన్నారంటే ఈ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది. పైగా పశ్చిమ బెంగాల్ లో ఘోర ఓటమి పాలైన బీజేపీకి యూపీ ఒక అగ్ని పరీక్ష.

కరోనా రెండో వేవ్ సమయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, నిరుద్యోగం, మహిళల పై మైనారిటీ ల పై దాడులు ఇలా.. యోగి పాలన పై తీవ్ర అసంతృప్తి తో ఓటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకానొక సమయం లో యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా తప్పించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇప్పుడు యోగి పేరు పై కాకుండా మోడీ పేరు పై ఓటర్లను ఆకర్షించే పనిలో బీజేపీ ఉన్నటు తెలుస్తుంది. అందుకే నరేంద్ర మోడీ ప్రధానిలా కాకుండా ఒక సాధువు అవతారం లో కాశి చుట్టూ తిరగడం చూస్తే బీజేపీ ఈ ఎన్నికలను అభివృద్ధి , పాలనా పరంగా కాకుండా హిందుత్వం, జాతీయవాదం అస్త్రాలు గా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తుంది. మునుపు యూపీ లో అధికారం లో ఉన్న పార్టీలు ఏమైనా ఉద్దరించాయి అని చెప్పడానికి కూడా లేదు.

మనదేశం లో ఎన్నికలంటేనే కులం, మాతం వాటి సమీకరణలు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక వర్గానికి చెందిన నలుగురు రాజపుట్ యువకులు దళిత అమ్మాయిని రేప్ చేసి చంపారని ఆరోపణలు రాగా ఆ అమ్మాయి మృతదేహాన్ని కన్న తల్లి తండ్రులకు చివరిచూపు కూడా లేకుండా అర్థరాత్రి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనపై దళితుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంమైంది.

యోగి పాలనలో బ్రాహ్మణులు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు పరశురాముని జయంతి రోజును సెలవు దినాన్ని రద్దు చేయడం, వికాస్ దుబే ఎన్కౌంటర్, ప్రభుత్వంలో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం తగ్గిపోవడం వంటి పలు అంశాలతో బ్రాహ్మణులు బీజేపీ పై గుర్రుగా ఉన్నారు.

సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటంతో సాగు చట్టాలును వెనక్కి తీసుకున్నా.. ప్లాన్ చేసి మరి రైతుల మీదికి కేంద్రసహాయ మంత్రి కొడుకు కారును ఎక్కించారని.. . సిట్ ఇటీవలే నివేదిక ఇచ్చింది. ఐనా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేదు.

యూపీ లో బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, బిఎస్పి ప్రస్తుతం కులాలవారీగా, మతాలవారీగా సమీకరణలు చేస్తున్నాయి. ప్రజలుకూడా కులం, మతం ప్రతిపాదికన కాకుండ అభివృద్ధి కై ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. ప్రజలు ఏ ప్రాతిపదికన ఓట్లు వేస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2022 assembly elections
  • bjp
  • modi
  • utterpradesh
  • yogi adityanath

Related News

Pm Modi Hits Back At Rahul

Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పురస్కరించుకుని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని మోదీ కేరళ పర్యటనలో దీటైన సమాధానం ఇచ్చారు

    Latest News

    • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

    • Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

    • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

    • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

    • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd