HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Uttarakhand Was The First State To Implement Ucc

Uniform Civil Code : UCC ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌

ఇక దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 27ని ఉత్తరాఖండ్‌లో యూసీసీ డేగా జరుపుకోనున్నట్లు సీఎం ప్రకటించారు.

  • Author : Latha Suma Date : 27-01-2025 - 2:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uttarakhand was the first state to implement UCC
Uttarakhand was the first state to implement UCC

Uniform Civil Code : ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి యూసీసీకి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేశారు. ఇక దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 27ని ఉత్తరాఖండ్‌లో యూసీసీ డేగా జరుపుకోనున్నట్లు సీఎం ప్రకటించారు.

ఇక, 2024 ఫిబ్రవ‌రి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. ఆ త‌ర్వాత మార్చి 12న నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చ‌ట్టాన్ని ఈ ఏడాది జ‌న‌వ‌రిలో పూర్తిగా అమ‌లు చేయ‌నున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమ‌లు కోసం ప్రత్యేక పోర్టల్‌, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మ‌హిళ‌లు, పిల్లల సాధికార‌తే ల‌క్ష్యంగా యూసీసీ అమ‌లు ఉంటుంద‌ని సీఎం ధామి గ‌తంలో తెలిపారు. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. కాగా, పోర్చుగీస్ పాల‌న‌లో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌర‌స్మృతి అమ‌ల్లో ఉంది.

యూసీసీలో ఉన్న నిబంధనలేంటి తెలుసుకుందా..?

. ఉత్తరాఖండ్ నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా చట్టం వర్తిస్తుంది.
. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ       సమానత్వాన్ని  సాధించేలా ఉంటుంది.
. వివాహం చేసుకోవాలంటే పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
. వివాహ నమోదు తప్పనిసరి.
. భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుంది.
. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం     వివాహాలు చేసుకోవచ్చు.
. హలాల్‌ విధానంపై కూడా నిషేధం విధించారు.
. సహజీవనం చేయాలనుకొనే వ్యక్తులు వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
. సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌)లో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్‌ విల్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులువుగా రూపొందించవచ్చు.

Read Also: Kohli Declines Captaincy: కెప్టెన్సీ వద్దన్న కింగ్ కోహ్లీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • CM Pushkar Singh Dhami
  • enforce uniform civil code
  • first state
  • UCC
  • uniform civil code
  • uttarakhand

Related News

Rahul Vote Chori Haryana

Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ సోషల్ మీడియా వేదికగా చేసిన 'సెంచరీ' సెటైర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

Latest News

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd