Tragedy : ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మహిళను ఏడు ముక్కలు చేసిన ప్రియుడు
Tragedy : దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు దారుణ సంఘటనలు విస్తరిస్తూనే ఉన్నాయి.
- By Kavya Krishna Published Date - 12:52 PM, Fri - 22 August 25

Tragedy : దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు దారుణ సంఘటనలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన సమాజాన్ని కలచివేసింది. ప్రియురాలు పదే పదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన ఓ ప్రియుడు, ఆమెను హత్య చేసి శవాన్ని ఏడు ముక్కలుగా నరికి సంచుల్లో వేసి బావిలో పడేశాడు.
ఝాన్సీ జిల్లాలోని కిషోర్‌పురా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్‌కు రచనా యాదవ్ అనే వితంతువు మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొంతకాలంగా ఆ మహిళ అతనిపై పెళ్లి ఒత్తిడి పెంచుతుండటంతో విసిగిపోయిన సంజయ్ ఆమెను తొలగించుకోవాలని నిర్ణయించాడు. ఈ కుట్రలో అతడు తన మేనల్లుడు సందీప్ పటేల్, మరో వ్యక్తి ప్రదీప్ అహిర్వార్‌ను కూడా కలుపుకున్నాడు. ముగ్గురూ కలిసి ఆగస్టు 8న రచనను దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ఏడు ముక్కలుగా చేసి, సంచుల్లో నింపి పొలంలోని ఒక బావిలో పడేశారు. ఆధారాలు మిగలనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం
అయితే ఆగస్టు 13న బావి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు చేరుకుని బావిలో తేలియాడుతున్న రెండు సంచులను వెలికి తీశారు. అందులో మానవ శరీర భాగాలు ఉన్నట్లు బయటపడటంతో గ్రామం అంతా భయాందోళనకు గురైంది. ఆగస్టు 17న అదే బావి నుంచి మరోసారి శరీర భాగాలు (చేతులు) బయటకు తీయగా, తల, కాళ్లు మాత్రం కనిపించలేదు. పోస్టుమార్టం అనంతరం ఆగస్టు 18న మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గుర్తింపు కోసం పోస్టర్లు అతికించగా, బాధితురాలి సోదరుడు వాటిని చూసి రచనా యాదవ్ అని నిర్ధారించాడు. ఆమె భర్త మరణించిన తర్వాత సంజయ్ పటేల్‌తో సంబంధం పెట్టుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇటీవలి కాలంలో పెళ్లి ఒత్తిడి పెరగడంతోనే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు 100 మందిని విచారించారు. 200కి పైగా సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. చివరికి ఆధారాల ఆధారంగా నిందితులు బయటపడ్డారు. సంజయ్ పటేల్, సందీప్ పటేల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టించేందుకు రూ.25,000 రివార్డు ప్రకటించారు. ఇక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రచనా యాదవ్ తల, కాళ్లను లఖేరి నది నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, వీరి కృషికి గుర్తింపుగా రూ.50,000 బహుమతి కూడా ప్రకటించారు.
Funny Complaint : లడ్డూ కోసం సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్.. మధ్యప్రదేశ్‌లో వింత సంఘటన