UP Teacher isbehaving With Girl : యూపీలో కీచక టీచర్.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించి..!
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. లక్నోలోని ఓ ప్రముఖ పాఠశాల...
- Author : Prasad
Date : 30-09-2022 - 10:13 IST
Published By : Hashtagu Telugu Desk
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. లక్నోలోని ఓ ప్రముఖ పాఠశాల ఉపాధ్యాయుడు పరీక్షలో తనను అనుచితంగా తాకినట్లు 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆరోపించింది. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్ష సమయంలో గణిత ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ఆశ్రయించారు. సెప్టెంబరు 26న తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి, ఉపాధ్యాయుడు కూడా అక్కడే ఉంటాడని చెప్పారు. అయితే, బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్న రోజున నిందితుడు ఉపాధ్యాయుడు సెలవు తీసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై నా కూతురు తన క్లాస్ టీచర్‌కు, ఆ తర్వాత స్కూల్ కో-ఆర్డినేటర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె తల్లి ఆరోపించింది. పాఠశాల యాజమాన్యం మొదట కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నించిందని ఆమె అన్నారు. గతంలో కూడా ఇతర బాలికలతో ఉపాధ్యాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. నిందితుడిపై లైంగిక వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.