UP Gangster: యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హతం.. అతని సోదరుడు కూడా…
ఊహించిందే జరిగింది... యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హతమయ్యారు. ప్రయాగ్ రాజ్ లో మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కు తీసుకెళుతుండగా కాల్పుల్లో మృతి చెందాడు.
- By Naresh Kumar Published Date - 11:52 PM, Sat - 15 April 23

UP Gangster: ఊహించిందే జరిగింది… యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హతమయ్యారు. ప్రయాగ్ రాజ్ లో మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కు తీసుకెళుతుండగా కాల్పుల్లో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతీక్ అహ్మద్ కుమారుడు అసదన్‌ను గురువారం పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా… 48 గంటల వ్యవధిలోనే మరో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ప్రయాగ్ రాజ్‌కు తరలించారు. కాల్పులు జరిగిన వెంటనే ప్రయాగ్ రాజ్‌లోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
అతిక్ అహ్మద్ ప్రస్తుతం జైలులో ఉంటోన్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన తన కుమారుడు అసద్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయన ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం అష్రాఫ్ అహ్మద్ అనారోగ్యానికి గురయ్యాడు. దీనితో అతిక్ అహ్మద్ అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్తోండగా.. రాత్రి 10:30 గంటల సమయంలో ఈ కాల్పులు జరిపారు.అత్యంత సమీపం నుంచి అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి వారిద్దరిపైనా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు.
ఊహించని ఈ ఘటనతో పోలీసులు దూరంగా వెళ్లిపోయారు. నేలపై కుప్పకూలిన అతిక్ అహ్మద్, అతని సోదరుడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి పారిపోయారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రయాగ్ రాజ్ పోలీసులు నిర్ధారించారు. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసే క్రమంలో ఎదురు కాల్పులు సైతం చోటు చేసుకున్నాయి. తమను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై హంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాన్ సింగ్ అనే కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి
2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురవగా… ఇదే కేసులో పోలీసులు మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ , అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసులు నమోదు చేశారు. ఉమేశ్ పాల్ హత్యకేసులో అతీక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ హత్య తర్వాత నుంచి అసద్, అతీక్ అనుచరుడు గుల్హామ్ అదృశ్యమయ్యారు. వీరిద్దరూ ఝాన్సీలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లారు. అక్కడ పోలీసులు , నిందితుల మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది.
https://twitter.com/ANI/status/1647293175780761601