ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!
ఈ మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,759 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 1,759 కోట్లు అందించనున్నాయి. మిగిలిన సుమారు రూ. 5 వేల కోట్లను అప్పు రూపంలో తీసుకోనున్నారు.
- Author : Gopichand
Date : 24-12-2025 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Metro: డిసెంబర్ 24, 2025న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం లభించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 12,015 కోట్ల భారీ ప్రాజెక్టును ఆమోదించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ సుమారు 65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
3 ఏళ్లలో పూర్తి కానున్న కొత్త మెట్రో ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టు కింద మొత్తం 13 కొత్త మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో 10 భూగర్భ, స్టేషన్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. కేంద్ర కేబినెట్ ఢిల్లీ మెట్రో ఫేజ్ 5Aను ఆమోదించింది. రూ. 12,015 కోట్ల వ్యయంతో 16 కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ నిర్మించబడుతుంది. దీనితో ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించనుంది అని తెలిపారు.
Also Read: నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji
ముఖ్యమైన మార్గాల వివరాలు
- రామకృష్ణ ఆశ్రమ మార్గ్ నుండి ఇంద్రప్రస్థ వరకు: 9.9 కి.మీ ట్రాక్ పొడిగింపు (ఖర్చు: రూ. 9,570.4 కోట్లు).
- ఏరోసిటీ నుండి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 వరకు: 2.3 కి.మీ ట్రాక్ పొడిగింపు (ఖర్చు: రూ. 1,419.6 కోట్లు).
- తుగ్లకాబాద్ నుండి కాళింది కుంజ్ వరకు: 3.9 కి.మీ ట్రాక్ పొడిగింపు (ఖర్చు: రూ. 1,024.8 కోట్లు).
నిధుల సేకరణ- ప్రయోజనాలు
ఈ మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,759 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 1,759 కోట్లు అందించనున్నాయి. మిగిలిన సుమారు రూ. 5 వేల కోట్లను అప్పు రూపంలో తీసుకోనున్నారు. ఈ విస్తరణ వల్ల ఢిల్లీలో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
భారతదేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ద్వారా నడపబడుతున్న ఈ వ్యవస్థ భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే మెట్రో వ్యవస్థ. ఇది ఢిల్లీ నగరాన్ని పరిసర ప్రాంతాలైన నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, బహదూర్‌గఢ్‌లతో అనుసంధానిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో 10 రంగుల కోడెడ్ లైన్లు, 250 కంటే ఎక్కువ స్టేషన్లు ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణగా సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ వద్ద ఒక మ్యూజియం ఉంది. అక్కడ ప్రజలు మెట్రో నడిపే అనుభవాన్ని కూడా పొందవచ్చు.