Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!
కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు తల్లి ప్రేమ మార్చిందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలకు లొంగిపోయారు.
- Author : hashtagu
Date : 07-07-2022 - 8:51 IST
Published By : Hashtagu Telugu Desk
కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు తల్లి ప్రేమ మార్చిందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలకు లొంగిపోయారు. జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించిన భద్రతా దళాలు ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు వారి కుమారులను అభ్యర్థించారు.
తల్లిదండ్రుల అభ్యర్థనకు కరిగిపోయిన ఉగ్రవాదులు బయటకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యువకులు ఇద్దరు కూడా ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని హింసా మార్గాన్ని ఎంచుకోవద్దని తల్లిదండ్రులు తమ పిల్లలకు సూచించాలని విజ్ఞప్తి చేశారు.