Twitter Ban: భారత్‌లో 11లక్షల ట్విట్టర్ ఖాతాల తొలగింపు
ఎలోన్ మస్క్ రూటే సెపరేటు. తనేం చెయ్యాలనుకుంటున్నాడో చేసి చూపిస్తాడు. ఒక్కోసారి మస్క్ తీరు ఆశ్చర్యంగా, ఫన్నీగా కూడా ఉంటుంది
- Author : Praveen Aluthuru
Date : 01-07-2023 - 1:08 IST
Published By : Hashtagu Telugu Desk
Twitter Ban: ఎలోన్ మస్క్ రూటే సెపరేటు. తనేం చెయ్యాలనుకుంటున్నాడో చేసి చూపిస్తాడు. ఒక్కోసారి మస్క్ తీరు ఆశ్చర్యంగా, ఫన్నీగా కూడా ఉంటుంది. ప్రపంచ కుభేరుల్లో ముందంజలో ఉన్న ఎలాన్ మస్క్ ఈ మధ్యే ట్విట్టర్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ట్విట్టర్ ని ఒక ఆటాడేసుకున్నాడు. విచిత్రమైన డీపీలు పెడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చల్ చేస్తున్నాడు. అయితే మస్క్ కొన్ని సందర్భాల్లో చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది.
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ ఏప్రిల్ 26 మరియు మే 25 మధ్య భారతదేశంలో రికార్డు స్థాయిలో 11,32,228 ఖాతాలను నిషేధించింది. ప్రస్తుతం ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యాకారినో వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో దేశంలో తన ప్లాట్‌ఫారమ్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 1,843 ఖాతాలను తొలగించింది.
మొత్తంగా భారతదేశంలో ట్విట్టర్ 11,34,071 ఖాతాలను నిషేధించింది.ట్విట్టర్ కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా తన నెలవారీ నివేదికలో తన ఫిర్యాదుల పరిష్కార విధానాల ద్వారా ఒకే సమయంలో భారతదేశంలోని వినియోగదారుల నుండి 518 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపింది.
Read More: Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. పీఎం 2 లక్షలు, సీఎం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా