56 Blades In The Stomach: రాజస్థాన్‌లో వింత ఘటన.. యువకుడి కడుపులో 56 బ్లేడ్ ముక్కలు..!
స్నేహితుడికి రక్తపు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన యువకుడికి స్కాన్ చేసిన వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
- By Gopichand Published Date - 09:25 AM, Wed - 15 March 23

స్నేహితుడికి రక్తపు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన యువకుడికి స్కాన్ చేసిన వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల యశ్‌పాల్ సింగ్ ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీ నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని నలుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం వారు కార్యాలయానికి వెళ్లగా యశ్‌పాల్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. అకస్మాత్తుగా రక్తం వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ఒక స్నేహితుడికి ఫోన్ చేసి, అతను అనారోగ్యంతో ఉన్నాడని చెప్పాడు. అతని స్నేహితులు గదికి చేరుకుని ఆసుపత్రిలో చేర్పించారు.
రక్తపు వాంతులతో ఉన్న యశ్‌పాల్‌ను మెడిప్లస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ నర్సిరామ్ దేవాసి మొదట ఎక్స్-రే చేసి, ఆపై సోనోగ్రఫీ కూడా చేశారు. దీంతో అతడి కడుపులో చాలా బ్లేడ్లు కనిపించాయి. ఎండోస్కోపీ చేయగా యశ్‌పాల్ కడుపులో బ్లేడ్లు ఉన్నాయని నిర్ధారించారు. ఆ తర్వాత అతడి ఆపరేషన్‌కు సన్నాహాలు చేశారు. ఏడుగురు వైద్యుల బృందం మూడు గంటలపాటు ఆపరేషన్ చేసి యశ్‌పాల్ కడుపులోంచి 56 బ్లేడ్‌లను బయటకు తీశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
Also Read: IIT Madras: మద్రాస్ ఐఐటీలో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య
యశ్‌పాల్ స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న అతని బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. యశ్‌పాల్ ఇన్ని బ్లేడ్లు ఎందుకు తిన్నాడో తమకు తెలియదని అంటున్నారు. యశ్‌పాల్‌కు డిప్రెషన్ లేదా ఆందోళనలో ఉండవచ్చునని, దాని కారణంగా అతను మూడు బ్లేడ్ ప్యాకెట్లను తీసుకున్నాడని వైద్యులు చెప్పారు. బ్లేడ్‌ని 2 భాగాలుగా విభజించి కవర్‌తో తిన్నాడు. దీంతో బ్లేడు కడుపులోకి వెళ్లిందని, కవర్ లేకుండా తిన్నట్లయితే అది గొంతులో ఇరుక్కుపోయి ఉండేది. బ్లేడ్ కడుపులోకి వెళ్లిన తర్వాత, దాని కవర్ కరిగిపోయి, కట్ కారణంగా కడుపు లోపల నుండి రక్తం రావడం ప్రారంభమైంది. దీంతో రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. యశ్‌పాల్ ఇన్ని బ్లేడ్లు ఎందుకు మింగాడు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వైద్యులు, అతని బంధువులు అతనితో మాట్లాడటానికి చాలాసార్లు ప్రయత్నించారు. అయితే అతను బ్లేడ్లు మిగటానికి కారణం ఇంకా చెప్పలేదు.

Related News

Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఆదివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.