HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄India
  • ⁄Andhra Student Dies By Suicide In Iit Madras

IIT Madras: మద్రాస్ ఐఐటీలో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య

మద్రాస్‌ (Madras)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)కి చెందిన మరో విద్యార్థి మంగళవారం (మార్చి 14) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థిని పుష్పక్‌గా గుర్తించారు. విద్యార్థి ఆంధ్రప్రదేశ్ నివాసి.

  • By Gopichand Published Date - 06:56 AM, Wed - 15 March 23
IIT Madras: మద్రాస్ ఐఐటీలో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య

మద్రాస్‌ (Madras)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)కి చెందిన మరో విద్యార్థి మంగళవారం (మార్చి 14) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థిని పుష్పక్‌గా గుర్తించారు. విద్యార్థి ఆంధ్రప్రదేశ్ నివాసి. పుష్పక్‌ ఇక్కడ B.Tech మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని పుష్పక్‌ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెలలో కూడా ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో ఒకరు మరణించారు.

గత నెల 14వ తేదీన కూడా ఐఐటీ మద్రాస్‌లో రెండు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మరో విద్యార్థి విష మాత్రలు తాగాడు. మాత్రలు వేసుకున్న మరో విద్యార్థిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

గత నెలలో ఐఐటీ మద్రాసులో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి మాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో ఉరివేసుకుని మృతి చెందిన విద్యార్థి మహారాష్ట్ర వాసి. అతడిని 27 ఏళ్ల స్టీఫెన్ సన్నీగా గుర్తించారు. మరోవైపు, ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన రెండో విద్యార్థిని కర్ణాటకకు చెందిన బి. వివేక్‌గా గుర్తించారు. అతని వయస్సు 22 సంవత్సరాలు.

Also Read: Internet: ఇంటర్నెట్ లో కిమ్ గురించి వెతికి ప్రాణాలు విడిచిన గూఢచారి.. అసలేం జరిగిందంటే?

ఈ ఇద్దరి విద్యార్థులను తలుపులు పగులగొట్టి బయటకు తీశారని పోలీసులు తెలిపారు. స్టీఫెన్ తన గదిలోకి వెళ్లడం చూసిన కొందరు స్నేహితులు అతని గది తలుపు తట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ సమాచారం హాస్టల్ వార్డెన్‌కు అందించారు. తన గది తలుపులు పగలగొట్టి చూడగా స్టీఫెన్ ఉరివేసుకుని కనిపించాడు. అదే సమయంలో మరో విద్యార్థి వివేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు కొన్ని రోజులు క్లాసుకు కూడా హాజరుకాలేదు. దీంతో అతని స్నేహితులు వివేక్‌ను కలవడానికి అతని రూంకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండడం చూసి తలుపులు తట్టారు. కానీ సమాధానం రాలేదు. ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వడం లేదు. ఇనిస్టిట్యూట్‌లోని అధికారులు తలుపులు పగులగొట్టి తెరిచి చూడగా అతను గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. సరైన సమయంలో ఆస్ప్రతికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Telegram Channel

Tags  

  • IIT Madras
  • student suicide
  • Suicide Case
  • tamil nadu
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Tamil Nadu: మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల 1000 రూపాయలు.. ఎప్పటి నుంచి అంటే..?

Tamil Nadu: మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల 1000 రూపాయలు.. ఎప్పటి నుంచి అంటే..?

తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబరు నుంచి అర్హులైన మహిళా కుటుంబ పెద్దలకు నెలవారీ రూ.1,000 సహాయ పథకం ప్రకటించడం అత్యంత పెద్దది.

  • Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

    Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

  • Fridge Explosion: ఫ్రిడ్జ్ పేలి పోలీస్ అధికారి, మహిళ సజీవ దహనం.. కోయంబత్తూరులో ఘటన

    Fridge Explosion: ఫ్రిడ్జ్ పేలి పోలీస్ అధికారి, మహిళ సజీవ దహనం.. కోయంబత్తూరులో ఘటన

  • Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

    Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

  • Rajinikanth: జయలలిత లాంటి మహిళను మళ్లీ మనం చూడలేం: రజనీకాంత్

    Rajinikanth: జయలలిత లాంటి మహిళను మళ్లీ మనం చూడలేం: రజనీకాంత్

Latest News

  • Upasana Baby Bump: రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఉపాసన బేబీ బంప్ లుక్.. ఫొటో వైరల్..!

  • YCP-Jagan : పెద్ద `రెడ్ల`తో పెట్టుకుంటే అంతే.! జ‌గ‌న్ రీ థింక్!

  • MLA Prasanna Kumar: నా చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్‌తోనే.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ప్రసన్నకుమార్..!

  • EPFO: ఉద్యోగులకు శుభవార్త.. PF వడ్డీ రేట్లు పెంచిన ప్రభుత్వం..!

  • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

Trending

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

    • PGCIL Recruitment : బీటెక్ చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారేంటీ…ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు

    • World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు

    • Shocking News: సగం ధరకు పడిపోయిన ట్విట్టర్ విలువ

    • Virat Kohli: 9వ తరగతి ఎక్సామ్ లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. వైరల్ వైరల్

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: