HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Time For Taking Oath Of Delhi Cm Is Finalized

Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!

సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • Author : Latha Suma Date : 14-02-2025 - 2:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Time for taking oath of Delhi CM is finalized..!
Time for taking oath of Delhi CM is finalized..!

Delhi New CM : బీజేపీ పార్టీ ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయిత ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో తొమ్మిది మందిని షార్ట్‌ లిస్ట్‌ చేసి.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.

Read Also: CM Chandrababu : యాసిడ్ దాడి ఘ‌ట‌న‌..తీవ్రంగా ఖండించిన సీఎం చంద్ర‌బాబు

ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్‌ వర్మ ముందంజలో ఉన్నారు. ఆయనతో పాటు సతీశ్‌ ఉపాధ్యాయ్‌, విజయేందర్‌ గుప్తా, ఆశిష్‌ సూద్‌, పవన్‌ శర్మ వంటి పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పూర్వాంచల్‌ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను సైతం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మోడీ ఢిల్లీకి వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్‌ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. మోడీతో చర్చలు జరిపి ఓ అంచనాకు రానున్నట్లు తెలిసింది.

కాగా, అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ భారత్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా , పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం నూతన సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది. ఇకపోతే..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయఢంకా మోగించి తన 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఆప్‌ కేవలం 22 స్థానాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ ఖాతా తెరవలేక చతికిలపడిన విషయం తెలిసిందే.

Read Also:  Rahul Ravindran : నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aam Aadmi Party (AAP)
  • amit shah
  • Delhi Assembly Elections
  • delhi cm
  • JP Nadda
  • pm modi

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd