Threat to Modi : మోడీపై ఆత్మాహుతి దాడి హెచ్చరిక
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి(Threat to Modi) చేస్తామని హెచ్చరిస్తూ
- Author : CS Rao
Date : 22-04-2023 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి(Threat to Modi) చేస్తామని హెచ్చరిస్తూ దుండగులు బీజేపీ కేరళ రాష్ట్ర(Kerala) ఆఫీస్ కు లేఖ రాశారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సరేంద్రన్ పోలీసులు అందచేయడంతో విచారణ మొదలు పెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఆ లేఖ పూర్వపరాలపై అధ్యయనం చేస్తున్నారు. మళయాళం భాషలో ఆ లెటర్ ఉంది. వారం క్రితం వచ్చిన లేఖను డీజీపీకి అందచేసినట్టు బీజేపీ చీఫ్ మీడియాకు వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి హెచ్చరిస్తూ(Threat to Modi)
కేరళ రాష్ట్రంలోని(Kerala) వివిధ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే షెడ్యూల్ ఉంది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళ రాష్ట్రంలో ఆయన పర్యటిస్తారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే, పలు కార్యక్రమాలకు శంకుస్థాన చేస్తారు. ఆ మేరకు పీఎంవో ఆఫీస్ షెడ్యూల్ ను ప్రకటించింది. పర్యటన సమయంలో నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి(Threat to Modi) చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ రాష్ట్ర ఆఫీస్ కు లేఖ రాశారు.
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళ రాష్ట్రంలో
వారం క్రితం అందని ఆ లేఖ శనివారం బయటకు వచ్చింది. ఆ లేఖ జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో సంచలనం కలిగిస్తోంది. కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్ మీడియాకు ఆ లేఖ గురించి వివరించారు. వారం క్రితం ఆ బెదిరింపు లేఖను(Threat to Modi) రాష్ట్ర పోలీసు చీఫ్‌కు అందజేసినట్లు చెప్పారు. అయితే, ఆలస్యంగా మీడియాలో వెలుగుచూసిందని తెలిపారు. బాంబర్‌ని ఉపయోగించి భారత ప్రధానికి ప్రాణహాని కలిగిస్తామని మలయాళంలో వ్రాసిన లేఖ వచ్చిందని ఇంటెలిజెన్స్ (Kerala)నివేదిక పేర్కొంది. లేఖ వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తి కోసం విచారణ చేస్తున్నామని నిఘా నివేదిక అందిస్తోంది.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్” ఒక ఘోర తప్పిదమని
(Kerala) పోలీసుల నుంచి “ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్” ఒక ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని సురేంద్రన్ ఆరోపించారు. 49 పేజీల నివేదికలో విధి నిర్వహణలో ఉన్న అధికారుల పేర్లు, వారి పాత్రలు, ప్రధానమంత్రి వివరణాత్మక కార్యక్రమం షెడ్యూల్ తదితర అంశాల వివరాలు ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి వి మురళీధరన్ కూడా ఇంటెలిజెన్స్ నివేదిక లీక్ కావడాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. “ప్రధాని భద్రత వివరాల నివేదిక ఎలా లీక్ అయిందో, వాట్సాప్‌లో వైరల్‌గా మారిందని ముఖ్యమంత్రి వివరించాలి. దీని అర్థం రాష్ట్ర హోం శాఖ కుదేలైంది” అని మురళీధరన్ ఆరోపించారు.
Also Read : Modi Tour : ప్రధాని మోడీ రికార్డ్, 36గంటల్లో 5000km జర్నీ
ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో (Threat to Modi) పేరు, నంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎన్‌జే జానీ తాను నిర్దోషినని చెప్పారు. “పోలీసులు నన్ను ప్రశ్నించారు. నేను వారికి అన్ని వివరాలను ఇచ్చాను. వారు చేతివ్రాత మరియు ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసారు” అని అతను మీడియాతో చెప్పాడు. ఈ లేఖ సంబంధించిన కొన్ని విషయాలపై ఆ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తిరువనంతపురం మరియు కొచ్చి నగరాల్లో దాదాపు 2,000 మంది పోలీసులను మోహరించారు. ఆత్మాహుతి దాడి బెదిరింపుతో కేరళ (Kerala) పోలీస్ అప్రమత్తం అయింది.
Also Read : Modi Surname Case: రాహుల్ కు జైలు ఖాయమా?.. ముందున్న అవకాశాలేంటి?