Pakistan : వీళ్లు ప్రజాప్రతినిధులు కాదు..ఉగ్రవాదులు !
Pakistan : పాక్ పాలక వర్గం ఉగ్రవాద మద్దతుదారులా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. భారత్‌పై అణు బాంబులతో దాడి చేస్తామని ముప్పులు మోపడం పాక్ అంతర్గత పరిస్థితులకు ప్రతిబింబం
- Author : Sudheer
Date : 28-04-2025 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూ కశ్మీర్‌లో పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) వల్ల భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పర్యాటకులపై జరిగిన ఈ దారుణ ఘటన తర్వాత భారత్‌లో ఒక్కసారిగా యుద్ధోన్మాదం చెలరేగింది. పాక్‌లో కూడా మంత్రులు సహా నాయకులు యుద్ధం గురించి బాహాటంగా మాట్లాడుతున్నారు. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తమ దేశం గతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని, ఇప్పుడు అదే తమ దేశాన్ని నాశనం చేస్తున్నదని ఒప్పుకోవడం గమనార్హం. ఉగ్రవాదానికి దూరంగా ఉండాల్సిందని ఇప్పుడైనా అర్థమైందని అతను చెప్పడం పాక్ పాలక వ్యవస్థ నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది.
Pak Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ ఏమయ్యాడు ? బంకర్‌లో దాక్కున్నాడా ?
పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ (Pakistan Minister Hanif Abbasi) చేసిన వ్యాఖ్యలు అయితే ఉగ్రవాద ధోరణిని తలపించేవిగా ఉన్నాయి. పాక్ వద్ద 130 అణు బాంబులు ఉన్నాయనీ, అవన్నీ భారత్‌పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని బెదిరింపులు చేశాడు. భారత్ ఎటువంటి కవ్వింపు చర్యలు తీసుకున్నా తీవ్రంగా ప్రతిస్పందించబోతామని హెచ్చరించాడు. సింధు జలాల విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ యుద్ధానికి రెడీగా ఉన్నామని చెలరేగిపోయాడు. ఇలాంటి వ్యాఖ్యలు పాక్ పాలకులు ఉగ్రవాద మెంటాలిటీతో పనిచేస్తున్నారని, శాంతి ప్రాధాన్యతను పూర్తిగా విస్మరించినట్లు స్పష్టమవుతోంది.
పాక్ మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే.. పాక్ పాలక వర్గం ఉగ్రవాద మద్దతుదారులా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. భారత్‌పై అణు బాంబులతో దాడి చేస్తామని ముప్పులు మోపడం పాక్ అంతర్గత పరిస్థితులకు ప్రతిబింబం. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్‌తో యుద్ధానికి వెళ్లడం పాక్‌కు మరింత విధ్వంసం తప్ప మరేమీ ఇవ్వదని. కానీ పాక్ పాలకులు వాస్తవాలను గమనించకుండా తమ స్వార్థం కోసం దేశాన్ని అంధకారంలోకి నడిపిస్తున్నారు. చివరికి ఈ ధోరణి పాకిస్థాన్‌కు తీవ్ర పరిణామాలు తీసుకువచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.