HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >The New Income Tax Act Comes Into Effect From April 1

Income Tax: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2026 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Income Tax Act
New Income Tax Act

New Income Tax Act  భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని వారు హామీ ఇచ్చారు.

2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు (2025-26 ఆర్థిక సంవత్సరం) ఆర్జించే ఆదాయానికి పాత చట్టం ప్రకారమే పన్నులు లెక్కించి, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుందని నిపుణులు వివరించారు. ప్రభుత్వం ఈ మార్పును దశలవారీగా, స్పష్టమైన ప్రణాళికతో అమలు చేస్తోందని వారు తెలిపారు.

ఇందులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ‘ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ను నోటిఫై చేసింది. దీని ప్రకారం వేతన జీవులకు పలు ఊరటనిచ్చే మార్పులు చేశారు. ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) మినహాయింపు పరిమితిని పెంచారు. 50 శాతం హెచ్ఆర్ఏ స్లాబులోకి మరిన్ని నగరాలను చేర్చారు. పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్‌ను నెలకు రూ.3,000, హాస్టల్ అలవెన్స్‌ను నెలకు రూ.9,000 వరకు పెంచారు. అదే సమయంలో హెచ్ఆర్ఏ, ఇతర పన్ను తగ్గింపుల కోసం డాక్యుమెంటేషన్, డిక్లరేషన్ నిబంధనలను కఠినతరం చేశారు.

ఈ కొత్త విధానంలో భాగంగా ‘ఫైనాన్షియల్ ఇయర్’, ‘అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘ట్యాక్స్ ఇయర్’ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు పన్ను ఫారమ్‌లను కూడా పూర్తిగా మార్చి, కొత్త నంబర్లను కేటాయించనున్నారు. దీనివల్ల ఫైలింగ్ ప్రక్రియలో స్పష్టత పెరిగి, సందిగ్ధత తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBDT
  • Financial Year
  • HRA Exemption
  • income tax
  • Income Tax 2026
  • income tax filing
  • Income Tax Rules 2026
  • income tax slabs
  • New Income Tax
  • New Income Tax Bill
  • New Income Tax Slabs
  • tax filing
  • tax slab
  • Tax Year

Related News

Income Tax

కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులివే!

పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా బంధువులకు అద్దె చెల్లించి HRA క్లెయిమ్ చేస్తుంటే ఇప్పుడు Form 124లో యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.

    Latest News

    • ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్‌లు చూసేందుకు సిద్ధమవ్వండి!

    • Madhira: మధిర కోల్డ్‌ స్టోరేజ్‌లో రెండో ఛాంబర్‌కు వ్యాపించిన మంటలు

    • Roja: తమిళ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రోజా!

    • Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

    • Income Tax: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది.

    Trending News

      • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పడిపోతున్న బంగారం ధరలు

      • మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

      • భారీగా పెర‌గ‌నున్న ఉద్యోగుల జీతాలు?!

      • ఎల్‌పీజీపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

      • Mumbai: ముంబై బీచ్‌లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd