Indian Coast Guard : ఇంటర్‌తో గవర్నమెంట్ జాబ్.. నెలకు 50వేలకుపైనే శాలరీ
Indian Coast Guard : ఇంటర్ చదివినా నెలకు రూ.50వేల శాలరీతో జాబ్ పొందే అవకాశమిది.
- Author : Pasha
Date : 14-02-2024 - 1:39 IST
Published By : Hashtagu Telugu Desk
Indian Coast Guard : ఇంటర్ చదివినా నెలకు రూ.50వేల శాలరీతో జాబ్ పొందే అవకాశమిది. అయితే నిర్దిష్ట శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు వెయిటేజీ ఉంటుంది. ఇంతకీ జాబ్ ఎందులో అనుకుంటున్నారు ? భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
- జనరల్ డ్యూటీ, టెక్నికల్ (మెకానికల్), టెక్నికల్ (ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్) అనే మూడు విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్‌ను రిక్రూట్ చేస్తున్నారు.
- కోస్ట్‌గార్డ్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై నాటికి 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 జూలై 1 నుంచి 2003 జూన్ 30లోపు జన్మించిన వారు అప్లై చేయొచ్చు.
- టెక్నికల్ (మెకానికల్) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 1 నాటికి 21-25 ఏళ్లు ఉండాలి. అంటే 1999 జూలై 01 నుంచి 2003 జూన్ 30 మధ్యలో జన్మించిన వారు అప్లై చేయొచ్చు.
- టెక్నికల్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 01 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 1999 జూలై నుంచి 2003 జూన్ 30లోపు జన్మించిన వారు అప్లై చేయొచ్చు.
- పైన మనం చెప్పుకున్న మూడు కేటగిరీల జాబ్స్‌కు ఇంటర్, సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలను అభ్యర్థులు కలిగి ఉండాలి.
- ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు రూ.56,100 దాకా వేతనం చెల్లిస్తారు.
- ఈ ఉద్యోగాలకు స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు(Indian Coast Guard) ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ జాబ్స్‌కు అప్లై చేసేవారు రూ.300 ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
- ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 19న మొదలై మార్చి 6 వరకు కంటిన్యూ అవుతుంది.
- మరిన్ని వివరాల కోసం ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్‌సైట్‌లో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌ను చూడొచ్చు.