Pan – Aadhaar Link: పాన్ కార్డు, ఆధార్ లింకు చేసేందుకు గడువు మరో 3 నెలలు పొడిగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?
పాన్‌తో ఆధార్ లింక్ చేసుకోనివారికి శుభవార్త చెప్పింది కేంద్రం. పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి గడువు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు జూన్ 30, 2023..
- By hashtagu Published Date - 04:40 PM, Tue - 28 March 23

Pan – Aadhaar Link : పాన్‌తో ఆధార్ లింక్ చేసుకోనివారికి శుభవార్త చెప్పింది కేంద్రం. పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి గడువు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు జూన్ 30, 2023 వరకు పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం త్వరలోనే రిలీజ్ చేయనుంది. మార్చి 31వ తేదీ వరకు గడువు విధించినప్పటికీ చాలా మంది లింక్ చేసుకోలేదు. దీంతో గడుపు పెంచేతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసేలోపు పాన్ ఆధార్ లింక్ చేయనట్లయితే.. పాన్ కార్డు డీయాక్టివేట్ అయితుంది. కార్డును ఎక్కడా ఉపయోగించలేరు. ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేయనట్లయితే వెంటనే చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.
In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions.
(1/2) pic.twitter.com/EE9VEamJKh— Income Tax India (@IncomeTaxIndia) March 28, 2023
ఇప్పటి వరకు కొందరు ఆధార్‌తో పాన్ లింక్ చేయాలనే గందరగోళంలో ఉన్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం, జూలై 1, 2017న శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కేటాయించబడిన ప్రతి వ్యక్తి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. గడువు పొడిగించినందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాన్ తో ఆధార్ ను లింక్ చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఆధార్ తో పాన్ లింక్ చేయనట్లయితే.. చర్యలు తప్పకుండా తీసుకోవల్సి వస్తుందని గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. పాన్ తో ఆధార్ లింక్ చేయనట్లయితే..పాన్ కార్డు నాన్ ఆపరేటివ్ గా మారిపోతుంది. దీంతో బ్యాంక్ అకౌట్ డి మ్యాట్ అకౌంట్ తెరవలేము. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడికి నిబంధనలు అడ్డంకిగా మారుతాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేరు. పన్ను చెల్లింపుదారుల నుంచి ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ వసూలు చేస్తుంటారు. ఇప్పటివరకు 51కోట్ల పాన్ లతో ఆధార్ ను అనుసంధానం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాన్ తో ఆధార్ లింక్ కోసం https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar వెబ్‌సైట్‌ను సందర్శించి లింక్ చేసుకోవచ్చు.
Also Read: Dhoni @ Marmo Gina Chepauk Stadium: ధోనీ.. ధోనీ.. మార్మోగిన చెపాక్ స్టేడియం

Tags
- aadhaar
- compliance
- deadline extension
- documents
- financial services
- government
- identity verification
- Indian Government
- last date
- legal requirements
- pan card
- Personal finance
- regulations.
- taxation

Related News

1 Lakh for BCs : బీసీలకు లక్ష సాయం..దరఖాస్తులకు లాస్ట్ డేట్ జూన్ 20
తెలంగాణలోని బీసీ వర్గాల కుల, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం(1 Lakh for BCs) అందించే స్కీంకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 20 వరకు అర్హులైన వారు అప్లికేషన్లు ఇవ్వొచ్చు.