S ** Consent : లైంగిక సమ్మతికి ఏజ్ ను ఫిక్స్ చేసిన కేంద్రం
S ** Consent : మైనారిటీ తీరని పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడమే తమ ప్రధాన ఉద్దేశమని కేంద్రం పేర్కొంది. 18 ఏళ్ల వయస్సు పరిమితిని బాగా ఆలోచించి, దేశంలోని సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించామని తెలిపింది
- Author : Sudheer
Date : 08-08-2025 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
లైంగిక సమ్మతి (S** Consent) వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. కేంద్రం ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ లైంగిక సమ్మతికి 18 ఏళ్ల వయస్సు తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం తన నిర్ణయానికి గల కారణాలను కూడా వివరించింది.
మైనారిటీ తీరని పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడమే తమ ప్రధాన ఉద్దేశమని కేంద్రం పేర్కొంది. 18 ఏళ్ల వయస్సు పరిమితిని బాగా ఆలోచించి, దేశంలోని సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించామని తెలిపింది. యువతీ యువకుల మధ్య “శృంగార భరిత ప్రేమ” పేరుతో ఈ వయస్సు పరిమితిని తగ్గించడం సమాజానికి ప్రమాదకరమని కేంద్రం అభిప్రాయపడింది.
Guvvala Balaraju : బీజేపీలోకి గువ్వల బాలరాజు
వయోపరిమితిని తగ్గించడం వల్ల పిల్లల అక్రమ రవాణా, బాలలపై నేరాలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. 16 ఏళ్ల వయస్సులో లైంగిక సమ్మతికి చట్టబద్ధత కల్పిస్తే, దానిని అడ్డు పెట్టుకుని చాలా నేరాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల రక్షణకు సంబంధించిన చట్టాలను బలహీనపరిచే ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని కేంద్రం తేల్చిచెప్పింది.
ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పిల్లల రక్షణకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లైంగిక నేరాల నుండి పిల్లలను కాపాడేందుకు ఇప్పటికే ఉన్న చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించవచ్చు.