Devendra Fadnavis : దేవేంద్ర ఫడ్నవిస్ యావరేజ్ స్టూడెంట్.. టీచర్ సావిత్రి చెప్పిన విశేషాలు
‘‘మా స్టూడెంట్ దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis) మరోసారి సీఎం అవుతున్నాడంటే చాలా గర్వంగా ఉంది.
- By Pasha Published Date - 05:49 PM, Wed - 4 December 24

Devendra Fadnavis : మహారాష్ట్రకు కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గురించి ఆయనకు పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్ సావిత్రి సుబ్రమణియం ఆసక్తికర వివరాలను మీడియాకు వెల్లడించారు. స్కూలు దశలో ఫడ్నవిస్ ఎలా ఉండేవారు అనేది ఆమె వివరించారు. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Grenade Attack : ఆర్మీ క్యాంపుపై టెర్రర్ ఎటాక్.. గ్రనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
‘‘దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న సరస్వతీ విద్యాలయంలో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో నేను టీచర్‌గా ఆయనను దగ్గరి నుంచి పరిశీలించాను. ఫడ్నవిస్‌ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అయినా చిన్నప్పటి నుంచి ఆయన చాలా మర్యాదపూర్వకంగా ఉండేవారు. ఫడణవీస్ వాళ్ల నాన్న గంగాధర్‌రావు అప్పట్లో ఎమ్మెల్సీగా వ్యవహరించారు. స్కూల్ రోజుల్లో ఆయన ఒక్కసారి కూడా ఏ ప్రోగ్రామ్‌లోనూ స్టేజీపైకి రాలేదు. ఏ ప్రోగ్రాంలోనూ పాల్గొనలేదు. ఫడ్నవిస్ ఇంత మంచి వక్త అవుతాడని మేం అనుకోలేదు. బహుశా ఏబీవీపీలో పనిచేయడం వల్లే ఆయనకు ఆ క్వాలిటీస్ వచ్చి ఉంటాయి ఫడ్నవిస్ అసాధారణ విద్యార్థేం కాదు. యావరేజ్ స్టూడెంట్. బాగా హైట్ ఉండటంతో క్లాస్ రూంలోని లాస్ట్ బెంచ్‌లో ఆయన కూర్చునేవారు. ఫడ్నవిస్ సున్నిత మనస్కుడు. తన చుట్టూ ఉన్నవారికి సాయం చేసే విషయంలో ఫడ్నవిస్ ముందుండేవాడు’’ అని టీచర్ సావిత్రి సుబ్రమణియం తెలిపారు.
Also Read :Google Hyderabad : హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
‘‘మా స్టూడెంట్ దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis) మరోసారి సీఎం అవుతున్నాడంటే చాలా గర్వంగా ఉంది. విద్యార్థి సక్సెస్ అయితే పేరెంట్స్ ఎంత సంతోషిస్తారో.. అంతే టీచర్స్ కూడా సంతోషిస్తారు. ఫడ్నవిస్ రాజకీయ జీవితంలో మరిన్ని పెద్దపెద్ద స్థానాలను అందుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను’’ అని టీచర్ పేర్కొన్నారు.