HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Tata Groups Market Value Now More Than Pakistans Economy

Tata Vs Pakistan : పాక్ జీడీపీని దాటేసిన టాటాగ్రూప్.. మార్కెట్ విలువ ఎంతో తెలుసా ?

Tata Vs Pakistan :  టాటా గ్రూప్.. మరోసారి మనదేశ గౌరవాన్ని పెంచింది. ది గ్రేట్ అనిపించుకుంది. 

  • Author : Pasha Date : 19-02-2024 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tata Vs Pakistan
Tata Vs Pakistan

Tata Vs Pakistan :  టాటా గ్రూప్.. మరోసారి మనదేశ గౌరవాన్ని పెంచింది. ది గ్రేట్ అనిపించుకుంది.  రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్ రూ. 30 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి భారత చరిత్రలో మరే కంపెనీ సాధించని కొత్త రికార్డులను నమోదు చేసింది. మన పొరుగు దేశం పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని కూడా టాటా గ్రూప్ కంపెనీ మార్కెట్ విలువ దాటేయడం విశేషం. గత ఏడాది వ్యవధిలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు  భారీగా పెరిగాయి. అద్భుతమైన రాబడి వచ్చింది. ఆ కంపెనీల ఉమ్మడి విలువ పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ కంటే ఎక్కువగా నమోదైంది. టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 30.3 లక్షల కోట్లకు చేరుకోగా.. పాకిస్తాన్ జీడీపీ విలువ రూ. 28.3 లక్షల కోట్ల వద్దే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్  అప్పులు, ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join

టాటా ఘణాంకాలు

  • టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 30.3 లక్షల కోట్లు కాగా అందులో ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ వాటాయే రూ. 15 లక్షల కోట్లు.
  • ఒక్క టీసీఎస్(Tata Vs Pakistan) వాటాయే పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ విలువలో సగం ఉంది.
  • టాటా గ్రూప్‌లో టాటా మోటార్స్, ట్రెంట్ విలువ కూడా ఎక్కువే.
  • టాటా మోటార్స్ షేర్లు గతేడాది కాలంలో 110 శాతం, ట్రెంట్ 200 శాతం పెరిగాయి.
  • టాటా టెక్నాలజీస్, టీఆర్ఎఫ్, బెనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్‌సన్ ఇంజినీరింగ్ వంటి షేర్లు మెరుగైన ర్యాలీ సాధించాయి.
  • టాటా గ్రూప్‌కు స్టాక్ మార్కెట్లో కనీసం 25 కంపెనీలను కలిగి ఉండగా, వాటిలో టాటా కెమికల్స్ మాత్రమే గడిచిన ఏడాదిలో 5 శాతం క్షీణించింది.

Also Read :Zomato – Ecommerce : ఈ-కామర్స్‌లోకి జొమాటో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌‌లకు పోటీ

పాక్ గణాంకాలు

  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎదురైన ప్రతికూల పరిణామాలతో పాకిస్తాన్ దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
  • పాక్‌కు ప్రస్తుతం రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ బయటి అప్పులు ఉన్నాయి. ఈ జూలై నాటికి చెల్లించాల్సిన రూ. 2 లక్షల కోట్ల రుణాలు కూడా ఉన్నాయి.
  • మరో రూ. 25 వేల కోట్ల విలువైన ఐఎంఎఫ్ సాయం గడువు వచ్చే నెలతో ముగియనుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచనుంది.
  • ప్రస్తుతం పాక్ వద్ద రూ. 6.65 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్య నిల్వలే ఉన్నాయి. ఇవి కేవలం రెండు నెలల దిగుమతులకు మాత్రమే  సరిపోతాయి.
  • పాకిస్తాన్  రుణ-జీడీపీ నిష్పత్తి 70 శాతం దాటిపోయింది. వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఆందోళనకర స్థాయిలో పరిస్థితి ఉంది. ఈ ఏడాది ప్రభుత్వాదాయంలో సగం వీటికే సరిపోతుందని అంచనా వేస్తున్నారు.
  • పాకిస్తాన్‌కు పూర్తి భిన్నంగా భారత జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లతో ఆ దేశం కంటే 11 రెట్లు పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది.
  • ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్, 2028 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించేందుకు రెడీ అవుతోంది.

Also Read : Rana Daggubati : రంగంలోకి రానా ‘సౌత్‌బే’.. హైదరాబాద్‌లో బాక్సింగ్‌ ఈవెంట్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • Pakistans Economy
  • tata group
  • Tata Market Value
  • Tata Vs Pakistan

Related News

Gold- Silver Rate Today

Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

చైనీస్ కొత్త సంవత్సరం సెలవుల కారణంగా మార్కెట్‌లో లిక్విడిటీ తక్కువగా ఉంది. దీనివల్ల చిన్న మార్పులు కూడా ధరల్లో పెద్ద హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.

  • Gold Rate

    బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd