Delhi CM: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ఉత్కంఠత
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురువారం ఈడీ ముందు హాజరు కానున్నారు.
- By Balu J Published Date - 11:18 AM, Thu - 2 November 23

Delhi CM: లిక్కర్ స్కాం ఢిల్లీ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా గత 9నెలలుగా తీహార్ లో జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈడీ ఎదుట కేజ్రీవాల్ హాజరు కానుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ లో గురువారం ఈడీ ముందు హాజరు కానున్నారు. అరెస్ట్ ఖాయమంటూ ఆప్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ విచారణ ఎదుర్కొన్నారు. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీశ్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలతో ఆయనను ఈడీ విచారించనున్నది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.