Guinness Record: సామూహికంగా సూర్య నమస్కారాలు, గిన్నిస్ కెక్కిన రికార్డు
- By Balu J Published Date - 05:45 PM, Mon - 1 January 24

Guinness Record: గుజరాత్‌లోని 108 ప్రాంతాల్లో సామూహికంగా సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఏకకాలంలో ఎక్కువ మంది సూర్య నమస్కారాలు చేసి రికార్డు సాధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటిచెబుతూ గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది.
ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (Guinness Record)లో చోటు దక్కించుకుంది. ప్రసిద్ధ మోధెరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈ సూర్య నమస్కారాలు చేశారు.
108 ప్రాంతాల్లో దాదాపు 4 వేల మందికి పైగా ఈ ఆసనం వేశారు. విద్యార్థులు, పలు కుటుంబాలు, యోగా ఔత్సాహికులు, వయో వృద్ధులు ఇందులో పాల్గొన్నారు. 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్యనమస్కారాలను ప్రదర్శించారు. ‘‘అత్యధిక మంది ఒకేసారి సూర్యనమస్కారాలు చేయడంలో ఇదే తొలి రికార్డ్. గతంలో ఇప్పటివరకూ ఎవరూ ఇలాంటి రికార్డ్‌కు ప్రయత్నించలేదు. ఈ రికార్డ్‌ను గుజరాత్ సొంతం చేసుకుంది’’ అని గిన్నిస్ ప్రతినిధి వెల్లడించారు.