Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
ఈక్రమంలోనే తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మే 2న ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాలని ఖేద్కర్‌ను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ మే 21కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు ఖేడ్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
- By Latha Suma Published Date - 03:14 PM, Mon - 21 April 25

Puja Khedkar : తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిన వ్యవహారంలో ఆ మధ్య మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పేరు మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈక్రమంలోనే తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మే 2న ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాలని ఖేద్కర్‌ను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ మే 21కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు ఖేడ్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
Read Also:Rahul Gandhi : సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ
ఈ కేసులో కచ్చితమైన విచారణ జరగలేదని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం.. విచారణ త్వరగా ముగించాలని పోలీసులను ఆదేశించింది. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖేడ్కర్‌ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి తెలిపారు. అయితే, కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణను కల్పించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈమేరకు సోమవారం ఆదేశాలిచ్చింది.
కాగా, అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించడంపై ఆరోపణలు పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పూజా ఖేద్కర్‌పై ఉన్నాయి. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ, ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో తిరిగి వెళ్లాలని ఆదేశించింది. యూపీఎస్సీ తప్పుడు పత్రాలతో పరీక్షను క్లియర్ చేసిందని గుర్తించడంతో, వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్నిరద్దు చేయడంతో హైకోర్టును పూజా ఖేద్కర్ ఆశ్రయించింది. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీ తనపై అనర్హత వేటు వేసే అధికారం లేదని కోర్టుకు వాదించినా, ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక, గత ఏడాది ఆగస్టులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు పూజా ఖేద్కర్‌కు మధ్యంతర రక్షణను అందించింది. కోర్టు ఈ మధ్యంతర రక్షణను ప్రతి సమయంలో పొడిగిస్తూ వచ్చింది.
Read Also: Singer Pravasthi : నాకు, మా ఫ్యామిలీకి ఏం జరిగినా వాళ్లే కారణం.. సునీత మా అమ్మని అలా అన్నారు.. నేను మ్యూజిక్ వదిలేస్తున్నాను..