Singer Pravasthi : నాకు, మా ఫ్యామిలీకి ఏం జరిగినా వాళ్లే కారణం.. సునీత మా అమ్మని అలా అన్నారు.. నేను మ్యూజిక్ వదిలేస్తున్నాను..
తాజాగా ప్రవస్థి ఈ షోపై, షోలో జడ్జీలు కీరవాణి, చంద్రబోస్, సునీతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన యూట్యూబ్ లో ఓ వీడియో షేర్ చేసింది.
- By News Desk Published Date - 01:45 PM, Mon - 21 April 25

Singer Pravasthi : పాడుతా తీయగా సింగిగ్ షోపై ఆ షోలో పాల్గొన్న సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు చేసింది. చైల్డ్ సింగర్ గా కెరీర్ మొదలుపెట్టి అనేక షోలతో గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్థి. ఇప్పుడు పాడుతా తీయగా 25వ సీజన్ లో కూడా పాల్గొంది. ఇటీవలే ప్రవస్థి ఎలిమినేట్ అయింది. అయితే తాజాగా ప్రవస్థి ఈ షోపై, షోలో జడ్జీలు కీరవాణి, చంద్రబోస్, సునీతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన యూట్యూబ్ లో ఓ వీడియో షేర్ చేసింది.
ఈ వీడియోలో.. షోలో ఎక్స్ పోజింగ్ చేయమన్నారు అని, బలవంతంగా డ్యాన్సులు వేయమన్నారు అని, తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. తనకంటే సరిగ్గా పాడని వాళ్ళను కూడా మెచ్చుకున్నారని, జడ్జీలు తనని ఒక చీడపురుగులా చూసారని వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సింగర్ సునీతపై కూడా ఆరోపణలు చేసింది. సింగర్ సునీత తనని కావాలని టార్గెట్ చేసిందని, తన మీద గ్రడ్జ్ తో ఉందని చెప్పింది.
ప్రవస్థి తను ఎలిమినేట్ అయ్యాక అక్కడ సెట్ లో జరిగిన సంఘటన గురించి చెప్తూ.. నేను ఎలిమేట్ అయినా ఎమోషనల్ అవ్వకుండా స్మైల్ తోనే ఉన్నాను. మా అమ్మ ముందు నుంచి ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఎమోషనల్ అయింది. మా అమ్మ వెళ్లి సునీత గారిని మా అమ్మాయికి ఎందుకు అన్యాయం చేశారు అని అడిగితే నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చీదరగా మాట్లాడారు. నేను వేరే షోలలో కూడా ఎలిమినేట్ అయ్యాను కానీ ఎక్కడా ఇలా మాట్లాడలేదు అని తెలిపింది.
అలాగే.. నేను కెరీర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టే ఇవన్నీ బయటపెడుతున్నాను. పెద్ద పెద్ద పేర్లు చెప్పాను కాబట్టి ఇంక నాకు ఛాన్సులు ఇవ్వరు. ఇలాంటి ఫ్రాడ్ షోలు చూడటం ఆపేయండి. చాలా మంది నాలాగా సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళు కెరీర్ కి భయపడి సైలెంట్ గా ఉన్నారు. నాకు, నా ఫ్యామిలీకి ఏమైనా అయినా సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపిక ప్రొడక్షన్ అనిల్.. వీళ్ళే కారణం అంటూ చెప్పింది ప్రవస్థి. దీంతో ప్రవస్థి ఆడియో టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మరి ప్రవస్థి చేసిన ఆరోపణలపై సునీత సమాధానమిస్తుందా చూడాలి.
Also Read : Vishwambhara : ట్రోల్స్ దెబ్బకు.. పెరిగిన చిరంజీవి ‘విశ్వంభర’ VFX బడ్జెట్.. ఎన్ని కోట్లు తెలుసా?