HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Stock Markets Post Massive Gains

Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2026 - 10:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stock market surges; markets close with gains.
Stock market surges; markets close with gains.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం, ఇరాన్‌పై దాడులను ట్రంప్‌ నిలిపివేశారన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి.

ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1,000 పాయింట్ల వరకు ఎగబాకింది. 1.35 శాతం లాభంతో 74,834 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్లు పెరిగి 23,455 స్థాయికి చేరుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచే బలమైన కొనుగోళ్లు కనిపించాయి.

రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లోనే ట్రేడవుతున్నాయి. రియాల్టీ సూచీ 2.5 శాతానికి పైగా లాభపడి టాప్‌ గెయినర్‌గా దూసుకెళ్తోంది. ఆటో, ప్రైవేట్‌ బ్యాంకులు, పీఎస్‌యూ బ్యాంకులు కూడా మంచి లాభాలు నమోదు చేస్తున్నాయి. మీడియా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, సిమెంట్‌, కెమికల్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాల షేర్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి.

మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు కూడా సానుకూలంగా కదిలాయి. మార్కెట్‌లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు కనిపించడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా జోష్‌ కొనసాగుతోంది. జపాన్‌ నిక్కీ సూచీ 3 శాతానికి పైగా ఎగబాకగా, హాంకాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ 2 శాతం పెరిగింది. దక్షిణ కొరియా కోస్పీ సూచీ 8 శాతానికి పైగా లాభపడింది. అమెరికా మార్కెట్లు కూడా గురువారం భారీ లాభాలతో ముగిశాయి.

ముడిచమురు ధరలు తగ్గడం మార్కెట్లకు మరింత ఊరటనిచ్చింది. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర కూడా 88.94 డాలర్ల వద్దకు దిగివచ్చింది. చమురు ధరల తగ్గుదల భారత్‌ వంటి దిగుమతి దేశాలకు సానుకూల అంశంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crude Oil Prices
  • International Crude Oil Prices
  • sensex
  • stock market

Related News

Saudi Arabia slashes crude oil prices.

Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

ప్రపంచ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude oil) డిమాండ్ గణనీయంగా తగ్గడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా తన చమురు ధరలపై భారీ కోత విధించింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించి క్రూడాయిల్ ధరలను బ్యారెల్‌కు ఏకంగా $11 తగ్గించింది. గత 26 సంవత్సరాల చరిత్రలోనే సౌదీ చమురు ధరల్లో ఇంతటి భారీ తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసా

  • Stock market ends with gains.

    Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

Latest News

  • Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

  • Trends : శ్రీకాళహస్తిలో ‘ట్రెండ్స్’ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం

  • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

  • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd