HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Stampede At Railway Stations

Stampedes : రైల్వేస్టేషన్లలో తొక్కిసలాటలు..ఇప్పటివరకు ఎన్ని..ఎక్కడ జరిగాయంటే..!!

Stampedes : ఇలాంటి తొక్కిసలాటలు కొత్తవి కావు. గతంలో కూడా రద్దీ ఎక్కువగా ఉండే పండగల సమయంలో, వేడుకల సమయంలో రైల్వేస్టేషన్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి

  • Author : Sudheer Date : 16-02-2025 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stampedes
Stampedes

భారతీయ రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట (Stampedes ) ఘటనలు ప్రయాణికులను ఖంగారుకు గురిచేస్తున్నాయి. గుంపులు ..గుంపులుగా ప్రయాణాలు చేయడం, రద్దీ ఎక్కువగా ఉండే వేళల్లో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 18 మంది మరణించటం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ప్రత్యేకించి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా స్టేషన్‌కు చేరుకోవడం, ఆలస్యం జరిగిన రైళ్లతో కలిసిన జన సందోహం ఈ విషాదానికి దారితీసింది.

Water Supply: హైద‌రాబాద్ వాసుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో వాట‌ర్ క‌ట్‌!

ఇలాంటి తొక్కిసలాటలు కొత్తవి కావు. గతంలో కూడా రద్దీ ఎక్కువగా ఉండే పండగల సమయంలో, వేడుకల సమయంలో రైల్వేస్టేషన్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2017లో ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 2013లో అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో కుంభమేళా సమయంలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతి చెందారు. వీటన్నింటికీ ప్రధాన కారణం అనేక మంది ప్రయాణికులు ఒకే చోట కిక్కిరిసి ఉండటం, సరైన మార్గదర్శకాలు లేకపోవడం. పండగల సీజన్లో ఎక్కువ మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్లకు చేరుతుంటారు. అయితే స్టేషన్ పరిధిలో నియంత్రణ లేకపోవడం, తగిన సౌకర్యాలు లేకపోవడం, రైల్వే అధికారులు సమయానికి సరైన చర్యలు తీసుకోకపోవడం తొక్కిసలాటలకు దారి తీస్తోంది. 2007లో వారణాసి గంగాస్నానం ముగించుకుని మోగల్‌సరాయ్ జంక్షన్‌కు చేరుకున్న భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో తొక్కిసలాట జరిగింది. మళ్లీ ఇదే పరిస్థితి 2004లో ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్ మార్చడం వల్ల ప్రయాణికులు తల్లకిందులుగా పరుగులు పెట్టి ప్రాణాలు కోల్పోయారు.

రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యలు మరింత కఠినతరం కావాలి. ప్రయాణికుల కదలికలను నియంత్రించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ప్లాట్‌ఫామ్ల వద్ద అధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం, అదనపు రైళ్లను నడపడం, ప్రయాణికుల కోసం క్లియర్ మార్గాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘోర ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మరింత సమర్థవంతమైన విధానాలను అవలంభించాలి. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా తీసుకుని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రద్దీని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రయాణికుల అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • railway stations
  • Stampedes

Related News

Tahawwur Rana

ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.

  • Trump's 10% Global Tariffs

    Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

Latest News

  • Prabhas : ప్లాప్ డైరెక్టర్స్ తో ప్రభాస్ భేటీ..సినిమా ఏమైనా చేస్తున్నాడా ?

  • విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం రేవంత్ తీపికబురు

  • Telangana Budget 2026-27 : తెలంగాణ సర్కార్ కు సవాల్ గా మారిన ‘ బడ్జెట్ 2026-27’

  • Anil Ravipudi New Project : ఈసారి నందమూరి హీరోతో వెంకీ ని కలిపిన అనిల్ రావిపూడి

  • సీఎం రేవంత్ ’99 రోజుల’ ప్రణాళిక సిద్ధం

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd