MK Stalin: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై.. స్టాలిన్ సంచలన కామెంట్స్!
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 9:41 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావడం గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం గానీ తాము కోరుకోవడం లేదని స్టాలిన్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే నడుచుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందంటూ వస్తున్న వదంతులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి అభీష్టాన్ని శిరసావహిస్తామని స్టాలిన్ పేర్కొనడంతో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.