SSC GD Recruitment 2024 : 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలు(SSC GD Recruitment 2024) ఉన్నాయి.
- Author : Pasha
Date : 07-09-2024 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
SSC GD Recruitment 2024 : పదో తరగతి పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లను సమర్పించవచ్చు. పరీక్ష ఫీజును ఆన్లైన్లోనే పే చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100. మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు లేదు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 14. అప్లికేషన్ ఫామ్‌లను నవంబర్ 5, 6, 7 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు. 2025 జనవరి/ ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయి. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలు(SSC GD Recruitment 2024) ఉన్నాయి.
Also Read :Electricity Saving Tips : మీ కరెంటు బిల్లు తగ్గాలా ? ఈ టిప్స్ ఫాలో కండి
- అభ్యర్థులకు 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరుగుతాయి.
- 160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 60 నిమిషాల్లో పరీక్ష రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/ హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
- అనంతరం ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జరుగుతుంది.
- చివరగా వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
- రిజర్వేషన్‌ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- ఈ రిక్రూట్‌మెంటులో ఎంపికయ్యే వారికి బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అసోం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను కేటాయిస్తారు.
Also Read :China Halts Foreign Adoptions : విదేశీయులకు పిల్లల దత్తతపై చైనా సంచలన నిర్ణయం
- ఈ ఉద్యోగానికి అప్లై చేసే పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ ఉండాలి. అంతకంటే హైట్ తగ్గకూడదు.
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.