HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Spicejet Passenger Deboarded After Misbehaving With Crew

SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో గొడవ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

స్పైస్‌జెట్ విమానం (SpiceJet Plane)లో క్యాబిన్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీని తరువాత ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడి, అతని సహ ప్రయాణికుడిని డిబోర్డ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు.

  • By Gopichand Published Date - 10:10 AM, Tue - 24 January 23
  • daily-hunt
Spicejet
Resizeimagesize (1280 X 720) 11zon

స్పైస్‌జెట్ విమానం (SpiceJet Plane)లో క్యాబిన్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీని తరువాత ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడి, అతని సహ ప్రయాణికుడిని డిబోర్డ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు. జనవరి 23న ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సోమవారం (జనవరి 23) తెలిపింది.

ఢిల్లీలో బోర్డింగ్ సమయంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందిని వేధిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై క్యాబిన్ సిబ్బంది పీఐసీకి, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారని స్పైస్‌జెట్ తెలిపింది. కలిసి ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు, సహ ప్రయాణికుడిని ఆఫ్‌లోడ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు. తాజాగా విమాన ప్రయాణంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.

అంతకుముందు జనవరి 5న, న్యూఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్న గోఫస్ట్ విమానంలో ఇద్దరు విదేశీ ప్రయాణికులు మహిళా ఫ్లైట్ అటెండెంట్‌తో అనుచితంగా ప్రవర్తించారు. విదేశీ ప్రయాణికులు ఒక ఎయిర్ హోస్టెస్‌ని తమతో పాటు కూర్చోమని కోరారని, మరో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు. ప్రయాణికులిద్దరినీ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఏజెన్సీ సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించగా, విషయాన్ని రెగ్యులేటర్ డీజీసీఏకు నివేదించారు.

#WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today

The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV

— ANI (@ANI) January 23, 2023

దీంతో పాటు ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన కూడా తెరపైకి వచ్చింది. 2022 నవంబర్ 26న శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • delhi airport
  • Fight in flight
  • SpiceJet
  • SpiceJet flight

Related News

Air India

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

ఎయిర్ ఇండియా, సహచర విమానయాన సంస్థలలో సీట్ల లభ్యత ఆధారంగా ప్రయాణీకులకు అక్టోబరు 20 నుండి తిరిగి బుకింగ్ చేయబడుతోంది. ఒక ప్రయాణీకుడి వీసా అక్టోబరు 20న గడువు ముగియనుండగా, వీసా నిబంధనల ప్రకారం అతనికి మిలన్ నుండి వెళ్లే మరొక విమానంలో చోటు కల్పించారు.

  • Deepotsav

    Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Head Constable

    Head Constable Posts : 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

Latest News

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

  • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd