HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sonia Rahul Gandhis Aircraft Makes Emergency Landing At Bhopal Airport

Aircraft Emergency Landing : సోనియా, రాహుల్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Aircraft Emergency Landing :  బెంగళూరులో విపక్ష పార్టీల మీటింగ్ ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరారు.

  • Author : Pasha Date : 19-07-2023 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aircraft Emergency Landing
Aircraft Emergency Landing

Aircraft Emergency Landing :  బెంగళూరులో విపక్ష పార్టీల మీటింగ్ ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరారు. అయితే ఆ విమానం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లోని రాజా భోజ్  విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. అయితే ఈవిషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. “ఇది ప్రాధాన్య ల్యాండింగ్ మాత్రమే.. అత్యవసర ల్యాండింగ్ కాదు” అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రామ్‌జీ అవస్తి  చెప్పారు. “ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ (Aircraft Emergency Landing) చేయబడింది” అని భోపాల్ పోలీసు కమిషనర్ హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు. “సాంకేతిక లోపం వల్ల విమానం అనుకోని టచ్‌ డౌన్‌కు దారితీసింది” అని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పారంటూ ఓ మీడియా సంస్థ కథనాన్ని పబ్లిష్ చేసింది.

Also read :  Llama 2 AI Chatbot  : చాట్ జీపీటీ, బార్డ్ కు పోటీగా “లామా 2”.. జుకర్ బర్గ్ మరో ఆవిష్కరణ 

చార్టెడ్‌ విమానం ల్యాండింగ్ పై  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ శోబా ఓజా మాట్లాడుతూ..  “సోనియా జీ, రాహుల్ జీ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కొంత సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది ” అని అన్నారు. ఈ పరిణామంపై సమాచారం అందుకున్న ఓజా, కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ పచోరీ, ఎమ్మెల్యేలు పీసీ శర్మ, ఆరిఫ్‌ మసూద్‌, కునాల్‌ చౌదరి సహా సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు విమానాశ్రయానికి చేరుకుని లాంజ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Also read :  India in Asia Cup: ఆసియా కప్ టోర్నీలో టీమిండియాదే పైచేయి.. ఇప్పటివరకు 7 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aircraft
  • Aircraft Emergency Landing
  • Bhopal Airport
  • chartered plane
  • rahul gandhi
  • sonia gandhi

Related News

Trump's harsh comments on India.. Is that why Modi is silent?: Rahul Gandhi asks

Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా యూడీఎఫ్ కూటమి భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మరియు సంక్షేమ పింఛన్లను ఏకంగా

    Latest News

    • Google Center : వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ ?

    • Rupee vs Dollar: డాలర్ ముందు కుప్పకూలిన భారత కరెన్సీ..

    • Ration Rice : రేషన్ కార్డు దారులకు గొప్ప శుభవార్త

    • Airplanes : ఏంటి..సగం విమానాలు సాంకేతిక లోపాలతో నడుస్తున్నాయా ?

    • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

    Trending News

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd