HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sonia Gandhis Illness Away From Cwc Meeting

CWC Meeting : సోనియాగాంధీకి అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం

సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడితే ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరవుతారని, లేదంటే ఆమె కూడా తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Author : Latha Suma Date : 26-12-2024 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sonia Gandhi
Sonia Gandhi

CWC Meeting : కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని బెలగావిలో గురువారం మరియు శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది. సోనియా గాంధీ వెంట కూతురు ప్రియాంక గాంధీ ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడితే ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరవుతారని, లేదంటే ఆమె కూడా తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శులు, మాజీ ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం మీద 200 మంది కీలక నాయకులు ఈ భేటీలో పాల్గొననున్నారని ఏఐసీసీ ప్రకటించింది. బెలగావిలో జరగనున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్” అని పేరు పెట్టారు.

ఈ సమావేశంలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించడంతో పాటు, వచ్చే ఏడాదిలో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ జరుగుతుంది. గురువారం మధ్యాహ్నం మహాత్మాగాంధీ నగర్‌లో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 27న ఉదయం 11:30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల గురించి కూడా సమీక్ష జరుగనుంది.

Read Also: Bal Puraskars : ఏపీ బాలిక జెస్సీకి రాష్ట్రీయ బాల పురస్కార్.. మరో 16 మందికి కూడా..

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • belagavi
  • cwc meeting
  • karnataka
  • Nava Satyagraha Baithak
  • Priyanka gandhi
  • rahul gandhi
  • sonia gandhi

Related News

Rahul Gandhi

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్ర

    Latest News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    • Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd