Mother Head : ఆస్తి కోసం కన్నతల్లి తలను నరికి తీసుకెళ్లాడు
Mother Head : అమానుషం.. ఘోరం.. దారుణం !! ఉత్తరప్రదేశ్‌లోని సీతాపుర్‌లో అమానుష ఘటన జరిగింది.
- Author : Pasha
Date : 10-12-2023 - 1:35 IST
Published By : Hashtagu Telugu Desk
Mother Head : అమానుషం.. ఘోరం.. దారుణం !! ఉత్తరప్రదేశ్‌లోని సీతాపుర్‌లో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి రాక్షసుడి కంటే దారుణంగా ప్రవర్తించి తన తల్లి తలను నరికేశాడు. అనంతరం తల్లి తలను తీసుకొని పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మిర్జాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 65 ఏళ్ల కమలాదేవికి తొలుత హరిద్వారి అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వారి కుమారుడి పేరు దినేశ్. కొన్నేళ్ల క్రితం భర్త హరిద్వారి చనిపోయాడు. దీంతో హరిద్వారి పేరిట ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని భార్య కమలాదేవికి, ఇంకొంత భాగాన్ని కుమారుడు దినేశ్‌కు కేటాయించారు. ఈ ఆస్తి వచ్చాక కమలాదేవి రెండో పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
తన తండ్రి ద్వారా వచ్చిన ఎకరన్నర ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని ఇటీవల కుమారుడు దినేశ్ తల్లి కమలాదేవితో గొడవకు దిగాడు. అయితే దీనికి కమలా దేవి నో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం మేకలను మేపేందుకు అడవికి వెళ్లిన కమలా దేవిపై కుమారుడు దినేష్ దాడి చేశాడు. తల్లి తలను నరికి మర్డర్‌కు పాల్పడ్డాడు. అనంతరం ఆమె తలను(Mother Head) తీసుకుని పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని పట్టుకొని, మృతురాలి తలను స్వాధీనం చేసుకున్నారు. కమలాదేవి మరో కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.