HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Singapore Airlines Vistara Merged Into The Air India

Tata Group: చక్రం తిప్పుతున్న టాటాలు..!

ఇప్పటికే మలేసియా ఎయిర్‌లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా  ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 30-11-2022 - 11:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Flight
Flight

ఇప్పటికే మలేసియా ఎయిర్‌లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా  ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ విలీన ప్రక్రియ 2024 మార్చి కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎప్పటినుంచో విలీనం గురించి ఈ రెండింటి మధ్య చర్చలు జరుగుతున్నాయి. విస్తారా, ఎయిర్ ఇండియా విలీనంకు సంబంధించి సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (SIA) కూడా మంగళవారం ప్రకటన చేసింది. విస్తారాను ఎయిర్ ఇండియాలో విలీనం చేసిన తర్వాత ఎయిర్ ఇండియాలో తమకు 25% వాటా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం విస్తారాలో టాటా గ్రూప్‌కు 51% వాటా ఉండగా మిగతా 49% సింగపూర్ ఎయిర్‌ లైన్స్ లిమిటెడ్‌ ది.

ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రూ.2058.5 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. విస్తారా  ఎయిర్ ఇండియాలో విలీనం పూర్తయిన తర్వాత సింగపూర్ ఎయిర్‌ లైన్స్ లిమిటెడ్‌కు ఎయిర్ ఇండియాలో 25.1% వాటా కలిగి ఉండనున్నట్లు ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది. ఈ విలీన ప్రకటన తర్వాత టాటా గ్రూప్ కూడా ప్రెస్ రిలీజ్ చేసింది. విలీనం పూర్తయితే ఎయిర్ ఇండియా 218 విమానాలతో భారత అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరిస్తుందని తెలిపింది. ఇక దేశీయంగా చూస్తే రెండో స్థానంలో ఉండనున్నట్లు వివరించింది. టాటా గ్రూప్ ₹.18 వేల కోట్లతో భారత ప్రభుత్వం నుంచి ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే.

సింగపూర్ ఎయిర్‌ లైన్స్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా కలిసి విస్తారాను ప్రారంభించాయి. ప్రస్తుతం 43 జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతోంది. రోజుకు సగటున 260 కంటే ఎక్కువ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు సమాచారం. మొత్తంగా ఇందులో 4700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక మరో విశేషం ఏంటంటే టాటా గ్రూప్‌కు ప్రస్తుతం నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా ఎయిర్‌‌లైన్స్ టాటాలవే. ఇవన్నింటినీ కూడా ఒకే గూటికి తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తోంది టాటా సన్స్. ఇప్పటికే ఎయిర్ ఏషియా ఇండియాలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు కొంత వాటాలుండగా దీనిని పూర్తిగా టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో ఎయిర్ ఏషియా ఇండియా నుంచి మలేసియా ఎయిర్‌లైన్స్ పూర్తిగా వైదొలిగినట్లే. దీంతో ఇది కూడా పూర్తి భారత విమానయాన సంస్థగా అవతరించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Air Asia
  • air india
  • Air Lines
  • india
  • singapore
  • Singapore Airlines
  • Singapore Airlines Vistara
  • tata
  • tata group
  • Vistara

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    Latest News

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

    • భార‌త్‌పై ట్రంప్ చిందులు!

    • WB Polling : పోలింగ్ కేంద్రానికి వచ్చిన భారీ ఏనుగు.. పరుగులు పెట్టిన ఓటర్లు

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    Trending News

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd