HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Separatist Amritpal Singhs Mother Arrested Ahead Of Protest March In Amritsar

Amritpal Singh : నా కొడుకును పంజాబ్‌ జైలుకు తరలించండి..​అమృత్​పాల్ సింగ్ తల్లి అరెస్టు

  • By Latha Suma Published Date - 11:29 AM, Mon - 8 April 24
  • daily-hunt
Separatist Amritpal Singh's mother arrested ahead of protest march in Amritsar
Separatist Amritpal Singh's mother arrested ahead of protest march in Amritsar

Amritpal Singh Mother Arrested : ఖలిస్థానీ(Khalistani) సానుభూతిపరుడు, వారిస్​ పంజాబ్​ దే చీఫ్ అమృత్​పాల్​ సింగ్​ తల్లి బల్వీందర్​ కౌర్‌(Balwinder Kaur)ను పోలీసులు అరెస్టు చేశారు. అసోం(Assam)లోని దిబ్రూగఢ్​ నుంచి పంజాబ్‌(Punjab) జైలుకు అమృత్​పాల్(Amritpal)​ను తరలించాలని డిమాండ్​ చేస్తున్న ఆమెను పంజాబ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సోమవారం ఆమె అమృత్​పాల్​తో పాటు అరెస్టైన మరికొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీ (చేత్నా మార్చ్) చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో పాటు అమృత్​పాల్​ మామ, మరికొంతమందిని ఆదివారం అమృత్​సర్​లో అరెస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘అమృత్​పాల్​ తల్లి బల్వీందర్​ కౌర్‌ను జ్యుడిషియల్​ కస్టడీకి పంపాం. ఇది కేవలం ముందస్తు అరెస్టు మాత్రమే. బల్వీందర్​తో పాటు సుఖ్‌చైన్ సింగ్‌, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం’ అని డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ ఆలం విజయ్​ సింగ్​​ తెలిపారు. కాగా, అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి ఆయన నిరాకరించారు.

Read Also: Phone Tapping Den : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌజ్ నుంచే ‘ఫోన్ ట్యాపింగ్’ !

అమృత్​పాల్​, అతడి మద్దతుదారులకు సంబంధించి జైలు మార్పునకు మద్దతుగా అతడి తల్లితోపాటు ఇతర ఖైదీల కుటుంబీకులు, బంధువులు మార్చి 8న చేత్నా మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బఠిండాలోని దామ్‌దామా సాహిబ్​ అకల్​ తఖ్త్​ సాహిబ్‌కు చెందిన జాతేదార్​ నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుండగా పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని అమృత్​పాల్ సింగ్​ తండ్రి మీడియాతో తెలిపారు. పోలీసుల చర్యను తప్పుబడుతూ శిరోమణి అకాలీదళ్​ నాయకులు ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వైఖరిని ఖండించింది.

Read Also: Hyderabad : హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు

మరోవైపు అమృత్​పాల్​ తల్లి బల్వీందర్​ కౌర్​, అరెస్టైన ఇతర ఖైదీలు కుటుంబీకులతో కలిసి గత ఫిబ్రవరి 22నుంచి అమృత్‌సర్‌లోని గోల్డెన్​ టెంపుల్​ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. అమృతపాల్‌తో పాటు ఇతర ఖైదీలను పంజాబ్‌లోని జైలుకు తీసుకువచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఆమె చెప్పారు. కాగా, అమృతపాల్​ సింగ్​తోపాటు మరో తొమ్మిది మంది మద్దతుదారులను గతేడాది ఏప్రిల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం వీరంతా అసోంలోని దిబ్రూగఢ్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amritpal Singh
  • Balwinder Kaur
  • khalistani
  • punjab

Related News

Once again, India's humanitarian approach...an early warning to Pakistan

Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd