Supreme Court : ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు ఫై వేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్ట్
ఈ పిటిషన్ లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
- Author : Sudheer
Date : 26-04-2024 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
ఈవీఎంలు, వీవీప్యాట్ల వెరిఫికేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ (ఈవీఎం) అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి అనేక అనుమానాలు రేకిత్తిస్తూనే ఉన్నాయి. ఈవీఎంలను హ్యాకింగ్ చేసి ఓటరు తీర్పును తారుమారు చేయొచ్చనే అనేకమంది అనుమానిస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(VVPAT) స్లిప్‌లను ఈవీఎం ద్వారా పోలైన ఓట్లతో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(Electronic Voting Machine) తో సరిపోల్చడంపై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు శుక్రవారం దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
Read Also : Lok Sabha Elections : ఖమ్మం ఎంపీ బరినుండి తప్పుకున్న రాయల నాగేశ్వరరావు